మంత్రి ధనసరి అనసూయ సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, జులై 11: పేదవాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు, నిర్మాణం పనులకు ఆమె స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంపత్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్‌లతో కలసి శంకుస్థాపన చేశారు.గోవిందరావుపేట మండలంలోని మొట్లగూడెంలో రాండ్స్టాడ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, సయోధ్య హోమ్ ఫర్ ఉమెన్ ఇన్ నీడ్ సహకారంతో సమ్మక్క సారలమ్మ అడవి ఆదివాసీ సహకార సమాఖ్య అడ్డాకుల ప్లేట్ తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. అంతకుముందు వన మహోత్సవంలో భాగంగా మంత్రి మొక్కను నాటారు. కార్యక్రమంలో ఎఫ్‌డిఓ రమేష్, ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్ రహమాన్, రాండ్‌స్టాడ్ గ్లోబల్ సంస్థ ప్రతినిధులు అక్యూల్, స్వాప్న విట్టల్, సంయుక్త మిక్కిలినేని, శైలజ, దాసికా, సిఎస్‌ఆర్‌టిమ్ ప్రణథిపూర్ణ, సైలజ, వంశీకృష్ణ, వినయ్ వంగళ, స్మిత కదారి, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.





