14 నుంచి టెన్త్ ‌ పరీక్షలు

– వాట్సాప్‌ ‌ద్వారా హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: పదో తరగతి పరీక్షలు ఈనెల‌ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్లను ఎస్ఎస్‌సీ బోర్డు  గురువారం విడుదల చేసింది. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థుల హాల్‌ ‌టికెట్లను వెబ్‌సైట్‌లలో అధికారులు వేర్వేరుగా అందుబాటులో ఉంచారు. తెలంగాణలో విద్యార్థులు తమ హాల్‌టికెట్లను బోర్డు ఆఫ్‌ ‌సెకండరీ ఎడ్యుకేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌, ఏపీ విద్యార్థులు వాట్సాప్‌లో హాల్‌ ‌టికెట్లు పొందవచ్చు. తెలంగాణ విద్యార్థులు వాట్సప్‌ ‌నంబర్‌ (8096958096) ‌ద్వారా డౌన్‌లోడ్‌ ‌చేసుకోవచ్చు. అలా కుదరకుంటే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్ద నుంచి కూడా ఈ హాల్‌ ‌టికెట్లను విద్యార్థులు పొందవచ్చు. తెలంగాణ అభ్యర్థులు 8096958096 వాట్సప్‌ ‌నంబర్‌కు హాయ్‌ అని సందేశం పంప‌గానే ఫోన్‌కి వెల్‌కమ్‌ టూ సేవ అని వస్తుంది. చాట్‌లో టైప్‌ ‌చేసి మెసేజ్‌ ‌చేయాలి. మొబైల్‌కు ఒక లింక్‌ ‌వస్తుంది. ఆ లింక్‌ను ఓపెన్‌ ‌చేసి జిల్లా, పాఠశాల పేరును ఎంచుకోండి. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ నమోదు చేస్తే హాల్‌టికెట్‌ ఫోన్‌లోనే వస్తుంది. ఈ హాల్‌టికెట్‌ ‌డౌన్‌లోడ్‌ ‌చేసి భద్రపరుచుకోండి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *