సంక్షోభం నుంచి సంక్షేమం వైపు..

తెలంగాణను పునర్నిర్మాణం వైపు తీసుకెళుతున్నాం • ఉమ్మడి రాష్ట్రంలో అవమానాలు •తెలంగాణలో గత పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాం.
•కన్నతల్లి ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహం •తెలంగాణ కవులు, రచయితలకు  సముచిత గౌరవం
•త్వరలో 300 గజాల ఇంటి స్థలంతో రూ.కోటి నగదు పురస్కారం •తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి  

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌తెలంగాణ తల్లిని చూస్తే కన్నతల్లి ప్రతిరూపంగా స్పురిస్తోందని  డిసెంబర్‌ 9 ఒక పవిత్రమైన రోజని అందుకే ఈ రోజు మన ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే ఉండాలని ఒక పండుగలా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ  కార్యక్రమం నిర్వహిస్తు న్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, తెలంగాణను పునర్నిర్మాణం వైపు తీసుకెళుతున్నామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభకు వొచ్చిన జనాన్ని చూస్తోంటే కృష్ణా, గోదావరి నదులు ఇక్కడ ప్రవహిస్తున్నట్లు ఉందన్నారు.. చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. భూలోకంలో ఏ ప్రాంతానికైనా, ఎవరికైనా గుర్తింపు తల్లితోనే అని,  మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి చేయడమే కాదు… అవమానించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచించి… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టిందని విమర్శించారు. కానీ  ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని మా సహచర మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత పాలకులు వాహనాలకు టీజీ బదులు టీఎస్‌ అని నిర్ణయించారు. అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీని అధికారికంగా వాహనాలకు ఏర్పాటు చేసేలా అమలులోకి తీసుకొచ్చామని వివరించారు. ఉద్యమ సమయంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని పదేళ్లుగా రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు.

 

ప్రజా ప్రభుత్వంలో ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం.. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో కవి అందెశ్రీని సన్మానించుకోవడం తనకు జీవితకాలం గుర్తుండే సందర్భం అని తెలిపారు.  ఉద్యమ కాలంలో వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ తల్లికి వివిధ రూపాలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అందుకే ప్రజా ప్రభుత్వం బహుజనుల తల్లి రూపమే తెలంగాణ తల్లి రూపంగా అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ తల్లిని చూస్తే కన్నతల్లి ప్రతిరూపంగా స్పురిస్తోంది. డిసెంబర్‌ 9 ఒక పవిత్రమైన రోజు.. ఒక పండుగ రోజు.. ఈ రోజు మన ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే ఉండాలని ఒక పండుగలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు.  సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, తెలంగాణను పునర్నిర్మాణం వైపు తీసుకెళుతున్నామని చెప్పారు.

 

తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులను గుర్తించాలని, గౌరవించాలని ఆదుకోవాలని ప్రభుత్వం భావించిందని, గూడ అంజయ్య, గద్దర్‌, ‌బండి యాదగిరి, అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌ ‌తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావును ప్రభుత్వం గుర్తిస్తోంది.. వారికి 300 గజాల ఇంటి స్థలంతో రూ.కోటి నగదు, తామర పత్రం అందించనున్నామని తెలిపారు. కొంత మందికి బాధ, ఆవేదన, దుఃఖం ఉండొచ్చు. వాళ్ల రాజకీయ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరమని వాళ్లు అనుకోవచ్చు.. కానీ ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో మనం తెలంగాణ సాధించుకోలేదు.. ఉమ్మడి రాష్ట్రంలో అవమానాలు ఎదుర్కొన్నాం.. తెలంగాణలో పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యామన్నారు.  ఇక అలాంటి అవమానాలు, నిర్లక్ష్యాలు ఉండకూడదని ప్రతీ ఏడాది డిసెంబర్‌ 9‌న తెలంగాణ తల్లి అవతరణ వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *