– ప్రజాభవన్‌లో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: కిశోర బాలికల కోసం ఏర్పాటు చేసిన స్నేహ సంఘాలను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రజాభవన్‌లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే స్నేహ సంఘాలు కూడా పనిచేస్తాయని, రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల 19.13 లక్షల మంది బాలికల కోసం స్నేహ సంఘాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కిశోర బాలికల్లో ఆరోగ్య అవగాహన, మానసిక ఆరోగ్యం, రుతుక్రమ సమయంలో శుభ్రతపై శిక్షణలు, అనిమియా తగ్గింపు, సరైన పోషకాహారంపై ప్రోత్సాహం, సైబర్ భద్రత, ఆన్‌లైన్ దుర్వినియోగాల నివారణ, స్కిల్ ట్రైనింగ్, కెరీర్ మేళాలు, ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలపై స్నేహ సంఘాలు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ప్రతీ యువతిని సురక్షితంగా, ఆరోగ్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో సమాజానికి నాయకురాలిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్నేహ సంఘాలు పనిచేస్తాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65,615 మందితో 61,38 కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి కిశోర బాలికను స్నేహ సంఘంలో సభ్యురాలిగా చేర్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్న స్నేహసంఘాలకు మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెర్స్ సీఈవో దివ్యా దేవరాజన్, కమిషన్ సభ్యురాలు గోగుల సరిత, టీజీ ఫుడ్స్ చైర్‌పర్సన్ ఫహీం తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





