– ఎనీ ప్రాపర్టీ ఆస్తులు గుర్తించి తగు చర్యలు
– ఉన్నతాధికారులతో సమీక్షించిన కేంద్ర మంత్రి బండి
న్యూదిల్లీ,ఆగస్ట్ 12:నెలాఖరులోపు స్వాతంత్య్ర సమరయోధుల పింఛను కేసులను పరిష్కరించాలని అధికారులను కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదేశించారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఆయన సక్ష నిర్వహించారు. తెలంగాణలోని ఎని ప్రాపర్టీస్ కేసుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన.. దీనిపై తక్షణమే సర్వే చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా 12,800 ఎని ప్రాపర్టీస్ ఉన్నాయని కేంద్రమంత్రికి అధికారులు తెలిపారు. 600కుపైగా ప్రాపర్టీస్ వేలందశలో ఉన్నాయని వివరించారు. వేలం వేసిన ఆస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. పెండింగ్ ఫైళ్లను వేగంగా క్లియర్ చేసిన అధికారులను కేంద్రమంత్రి అభినందించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కార్యాలయంలో పునరావాస విభాగంసీనియర్ అధికారులు, ఇండియాలో శత్రు ఆస్తుల సంరక్ష అధికారులతో సక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్లు, శత్రు ఆస్తుల ఆర్థికీకరణ, శరణార్థుల పునరావాసలపై అధికారులు కేంద్ర మంత్రికి సమగ్ర నివేదిక అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ కేసులను ఈ నెలాఖరులోపు పరిష్కరించాలని బండి సంజయ్ అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా 12,800 ఎని ఆస్తులున్నాయని అధికారులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వివరించారు. 600లకుపైగా ఎని ప్రాపర్టీస్ వేలం దశలో ఉన్నాయని తెలిపారు. ఫ్రీడం ఫైటర్స్ పెన్షన్ కేసులను పరిష్కరించి, ఎని ఆస్తులపై తక్షణమే సర్వే చేయించాలని ఆయన అధికారులకు సూచించారు. తెలంగాణలోని ఎని ప్రాపర్టీస్ కేసుల పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఎని ప్రాపర్టీస్ సమస్యలను పరిష్కరించేందుకు సర్వేను వేగవంతం చేయాలని ఆయన చెప్పుకొచ్చారు.





