హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి శిక్షణ శాఖ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఉచిత స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ తెలియజేశారు. ఏదైనా డిగ్రీ, డిప్లొమా, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన లేదా చివరి సంవత్సరం చదువుతున్న ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ అర్హతల జిరాక్స్ సర్టిఫికెట్స్‌తో ఏప్రిల్ 4వ తేదీన ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో(యూఈఐ అండ్ జీబీ/ఎంసీసీ) నందు హాజరు కావాల్సిందిగా కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





