హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ, నిర్మాణ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో యువత నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాల మెరుగుకు ఎంప్లాయబులిటీ స్కిల్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో డిప్యూటీ చీఫ్ తెలియజేశారు. ఈనెల 8, 9 తేదీలలో ఈ శిక్షణ ఉంటుందన్నారు. ఏదైనా డిగ్రీ, డిప్లొమా, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన లేదా చివరి సంవత్సరం చదువుతున్న ఆసక్తి గల అభ్యర్థులు 8వ తేదీ ఉదయం 10 గంటలకు నేరుగా ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో నందు విద్యారత, ఆధార్ జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరు కావలసిందిగా కోరారు. మరిన్ని వివరాలకు 8801528936 లో సంప్రదించాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



