హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 14: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్-1, 2, 3, 4, ఆర్‌ఆర్‌బి, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకు పరీక్షలకు అర్హులైన అభ్యర్థులకు 150 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపికైన వారికి రూ.1000 చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నారు. ఈమేరకు టీజీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్రంలో మొత్తం 12 టీజీ బీసీ స్టడీ సర్కిళ్లలో పైన తెలిపిన రిక్రూట్‌మెంట్లకు ఫౌండేషన్ కోర్సు ఉచిత కోచింగ్ ప్రోగ్రాంను ఆగస్టు 25 నుంచి 150 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన అభ్యర్థులు షషష.్‌స్త్రపషర్‌బసవషఱతీషశ్రీవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ ద్వారా ఈనెల 16 నుంచి వచ్చేనెల 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలని, తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు కలిగి ఉండాలని సూచించారు. డిగ్రీ పరీక్షలో అత్యధిక శాతం మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక విధానం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 040- 24071178లో సంప్రదించవచ్చన్నారు.
గ్రూప్ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ





