ఐటీ మంత్రితో ఫ్రాన్సు కాన్సుల్‌ జనరల్‌ భేటీ

హైదరాబాద్‌, బెంగళూరులోని ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌, అడ్మినిస్ట్రేటర్‌ ఆఫ్‌ ది స్టేట్‌ మార్క్‌ లామీ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును సచివాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ-ఫ్రాన్స్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చించారు. అలాగే ఇరుపక్షాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, వివిధ రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కూడా చర్చించారు. టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తి తదితరులు కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *