నలుగురు కొత్త జడ్జిల ప్రమాణం

– ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌

‌హైదరాబాద్‌,‌జూలై31(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్‌ ‌జస్టిస్‌ ‌వీరితో ప్రమాణం చేయించారు. జస్టిస్‌ ‌గాడి ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌జస్టిస్‌ ‌రామకృష్ణా రెడ్డి, జస్టిస్‌ ‌సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ ‌గౌస్‌ ‌రా మొహియుద్దీన్‌తో సీజే జస్టిస్‌ అపరేశ్‌ ‌కుమార్‌ ‌సింగ్‌ ‌ప్రమాణం చేయించారు. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, లాయర్లు హాజరయ్యారు. హైకోర్టులో లాయర్లుగా ఉన్న ఈ నలుగురిని జడ్జిలుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో వారి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28న ఆమోదముద్రవేశారు. దీంతో రాష్ట్ర హైకోర్టులో జడ్జిల సంఖ్య 30కి చేరింది. మొత్తం 42 మంది జడ్జిలు ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *