నాలుగు దశాబ్దాల తిర్మల్ ఉద్యమ సాహిత్యం-వికాస్

ప్రముఖ కవి, రచయిత, జర్నలిస్టుగా బహుముఖీన పాత్ర నిర్వహిస్తున్న తిర్మల్ సాహిత్యానికి నాలుగు దశాబ్దాలకాలం నిండింది. మహాకవి శ్రీశ్రీతో ఏర్పడిన సాన్నిహిత్యం, మాచర్ల విరసం మహాసభల్లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా విప్లవసాహిత్యంలో బాగం అయ్యారు.అప్పట్లో ఖమ్మం జిల్లా విరసం యూనిట్ కార్యదర్శిగావిరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఉన్న తిర్మల్ఖమ్మం విరసం యూనిట్ ద్వారా‘ఉద్యమ గానం’ పాటల సంకలనం వెలువరించడంలోతనదైనపాత్ర నిర్వహించారు.1985లో విరసం నుండి ‘ప్రజా రచయితలసంఘం’ ఆవిర్భవించడంలో కీలకపాత్ర నిర్వర్తించారు.వరవరరావు, త్రిపురనేని మధుసూదనరావు,హెచ్చార్కే,నమ్ము లాంటి రచయితల స్ఫూర్తితో విప్లవోద్యమం, తెలుగు సాహిత్యంలో కృషి చేశారు.

వివిధపత్రికల్లో వచ్చిన తన కవితలను1987లో ‘ధిక్కారస్వరం’ పేరుతో తన తొలికవితాసంపుటి తెచ్చారు. ఈ సంపుటి మొత్తం ఆనాడు తెలంగాణాలో కొనసాగుతున్న ఎన్కౌంటర్హత్యల  నేపథ్యంలో హక్కుల ప్రాధాన్యతని ఎత్తిచూపుతుంది.ఈనాడు ఆపరేషన్ కగార్ పేరుతో పాలకవర్గం గిరిజనులను, విప్లవకారులనుఎన్కౌంటర్ పేరుతో హతమార్చడానికి ఆనాడే పునాది పడింది.మనిషి జీవించే హక్కుల పతాకంగా తిర్మల్ ‘ధిక్కార స్వరం‘వినిపించారు.నాలుగు దశాబ్దాలు దాటినా పాలకుల హింసా విధానంలో మార్పులేదు. ఈ సంపుటికి  ”కత్తిమొనమీదస్వేచ్ఛ స్వరం’ అన్న ముందుమాట నమ్ము రాయగా,దానికి సంకెళ్ళు తెంచుకునే చిత్రం కా.సంద్యక్క జీవన సహచరుడు అమరుడు రామకృష్ణారెడ్డి గీశారు.ఈపుస్తకం అచ్చులో ముఖ్యపాత్ర వహించిన కా.పణి కూడా తర్వాత అమరులయ్యారు.

ఆయన ప్రజారస నుండి వచ్చిన ‘చిరునామా’ కవితా సంకలనానికి సంపాదకులుగా వ్యవహరించారు.1991లో వచ్చిన తిర్మల్ దీర్ఘకవిత ‘యుద్దం’గల్ఫ్యుద్ధం సమయంలో వచ్చింది.ప్రజారసనుండి వైదొలగిన తిర్మల్ 2002-06 మద్య‘ప్రజాసంస్కృతి’ సాహిత్యపత్రిక నడపి- రైతాంగ, మైనారిటీ, మహిళా ప్రత్యేకసంచికలు తెచ్చారు.తెలంగాణా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించిన తిర్మల్ తెలంగాణా రచయితల వేదిక బాధ్యుడుగా పదేళ్ళపాటు పనిచేశారు.ఈసందర్భంగానే ఉర్దూ,హిందీ, తెలుగు త్రిభాషాకవి ‘తెలంగాణాహీరో హీరాలాల్ మోరియా’ జీవితచరిత్ర రాశారు.దీన్ని తెలంగాణా జాతిపిత ప్రొ.జయశంకర్ ఆవిష్కరించారు. పోలవరం ముంపు సమస్యపై చేపట్టిన తెలంగాణా కవుల పోలవరం లాంచియాత్ర కవితలను ‘జలఖడ్గం’ పేరుతో తీసుకువచ్చారు. .2010లో తెలంగాణాకవులను వెలికితీయడంలో బాగంగా ‘మరుగునపడ్డమణిమకుటంచందాల కేశవదాసు’ బయోగ్రఫీ తెచ్చారు.ప్రజాగాయకుడు నాగన్న పుస్తకం కవి గౌరీశంకర్ తో కలిసి ఆవిష్కరించారు.

తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రైతాంగకుటుంబం నుండి ఎదిగిన తిర్మల్- కాళ్ళ గీచిన అద్భుతమైన ముఖచిత్రంతో ‘తీతువుపిట్ట’ కవితాసంపుటి తెచ్చారు.పంటలకుగిట్టుబాటుధరలేక ఆత్మహత్యల పాలైన రైతుల ఆత్మఘోషను కవిత్వంగా వినిపించారు.దీనికి సతీష్ చందర్ ముందుమాట రాశారు.తానురాసినవ్యంగ్యరచనలు, సంపాదకీయాలు కలిసి‘రాతలు-వాతలు’గా తెచ్చారు.తెలంగాణా ప్రభుత్వ తెలుగుమహాసభల్లో తిర్మల్ రాసిన‘హీరాలాల్ మోరియా బయోగ్రఫీ తెలుగు అకాడమీ ప్రచురణగా వచ్చింది.కాకతీయ గొలుసుకట్టు చెరువులుపై‘మనఊరు -మనచెరువు’ పుస్తకం తెచ్చారు.ఎన్.తిర్మల్ కేవలం రచయిత మాత్రమేకాదు! నాలుగుదశాబ్దాల జర్నలిస్టు. ప్రస్తుతం ఆయనకి ఆరుపదుల వయస్సు దాటినా ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా తెలంగాణా రాష్ట్రంలోని ప్రముఖ దినపత్రికలకు ఎన్.తిర్మల్ పేరుతో తరుచుగా రాస్తూనే ఉన్నారు.ఆయన వివిధ దినపత్రికల్లో రాసిన సాహిత్యవ్యాసాలు‘చురక-1’ గా,విద్య,సామాజిక,రాజకీయవ్యాసాలు‘చురక-2’ గా తెచ్చారు.పిడిఎస్ యు- తిర్మల్ రాసిన వ్యాసాలు ‘విద్యాహక్కు చట్టం ఎవరికి చుట్టం?’ పేరుతో పుస్తకంగా తెచ్చింది.అఖండ జ్ఞానజ్యోతి గెంటేల నారాయణరావు బయోగ్రఫీ ఇటీవలనే రాశారు.

తిర్మల్ ఉపాధ్యాయ ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు.పిడిఎస్ యు విద్యార్థిఉద్యమంద్వారా ఎదిగారు.ఛత్తీస్ ఘడ్  వలసబాలల కోసంబడి, బయటి పిల్లల కోసం,పట్టణ వీధిబాలల కోసం ఖమ్మంజిల్లాలో కృషిచేశారు.మద్యవ్యతిరేక, పర్యావరణ,ప్రజాస్వామ్యఉద్యమాల్లో తనదైనపాత్ర నిర్వర్తించారు.సకలజనులవేదిక, వికాసవేదిక,చైతన్యవేదిక, సాంఘికశాస్త్ర క్లబ్బులాంటి వాటిద్వారా సామాజిక చైతన్యం కోసం కృషిచేశారు.అనేక సాహిత్యసభలు, సమావేశాలు నిర్వహించడంతోపాటు అనేకపుస్తకాలు ఆయన సంపాదకత్వంలో రూపుదిద్దుకున్నాయి.విద్యాహక్కుచట్టం,విద్యారంగంపై సమగ్ర అవగాహన ఉన్న తిర్మల్ దశాబ్దంన్నర కాలంగా ఆయారంగాల్లో పాలకుల విధానాలు ఎండగడుతూ రావడమే కాకుండా బాద్యతాయుతమైన పాత్ర నిర్వర్తించారు.ఖమ్మం జిల్లావాసిగా తిర్మల్ జిల్లాలో ఉత్తమ సెక్టోరల్ అధికారిగా,ఉత్తమ సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులుగా, ఉత్తమరచయితగా అవార్డులు అందుకున్నారు.

ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యులుగా పోటీచేసి తనదైనశైలిలో ఆత్మీయ పలకరింపు యాత్ర ఆరునెలలపాటు చేశారు.ధనప్రభావంగల ఎన్నికల ధనరాజకీయాలలో ఓడిపోయారు. నిరాడంబరశైలి ప్రచారం చేశారు.త్వరలో‘బహురూపుల మనిషిఓమనిషి అంతరంగ తరంగం అక్షరరూపంలో తనజీవనయాత్రను సమాజం ముందుకు తేనున్నారు.ప్రస్తుతం జర్నలిజం,కథలపై కృషి చేస్తున్న నల్లమోతు తిరుమలరావు అలియాస్ ఎన్.తిర్మల్ కలం నుండి మరిన్ని మంచిపుస్తకాలు,రచనలు వెలువడాలని ఆశిద్దాం.సామాజిక వాస్తవికతను వస్తువుగా ఎంచుకొని రాణిస్తున్న తిర్మల్ రచనావ్యాసంగం మరింత కొనసాగాలని,ప్రజా ఉద్యమాలకు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు ప్రేరణగా, వెన్నుదన్నుగా నిలబడాలని ఆకాంక్షిద్దాం.నలబైఏళ్ళ తిర్మల్ సాహిత్య ప్రస్థానం మరింత ముందుకు సాగాలని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *