– ఒకరికా లేదా ఇద్దరికా అనేది రేపు తెలుస్తుంది: పిసిసి చీఫ్ మహేష్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: రాజ్యసభ స్థానాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సమర్థవంతమైన నలుగురు బీసీ నేతలు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని తెలిపారు. రాష్ట్రం నుంచి ఒకరికి ఇస్తారా లేదా ఇద్దరికి ఇస్తారా అనేది బుధవారం తెలుస్తుందన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానం కోసం అడగడం లేదని చెప్పారు. కార్పొరేట్ శక్తులకు బీఆర్‌ఎస్ రాజ్యసభ అవకాశాలు ఇచ్చిందని విమర్శించారు. తెలంగాణ కోసం పనిచేసిన వారిలో ఒక్కరికైనా బీఆర్‌ఎస్ రాజ్యసభ ఛాన్స్ ఇచ్చిందా అని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులు ఇస్తామని, ప్రస్తుతం వాటిపై కసరత్తు జరుగుతోందని మహేష్ గౌడ్ తెలిపారు. పినరయి విజయన్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానం ఇచ్చారని చెప్పారు. రాజకీయాల కోసమే విజయ్ మాట్లాడుతున్నారని, కేరళంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన వెల్లడించారు. నమ్ముకున్న సిద్దాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పనిచేశారని టీపీసీసీ చీఫ్ చెప్పుకొచ్చారు. ఆపరేషన్ కగార్‌ను తాము వ్యతిరేకించామని తెలిపారు. పాకిస్థాన్‌తో చర్చలకు ఒప్పుకున్న మోదీ మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకోలేదని విమర్శించారు. వారి సిద్దాంతంతో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రజల కోసం పోరాడిన వారిపై గౌరవం ఉంటుందని చెప్పారు. తామైనా, మావోయిస్టులయినా పేద ప్రజల కోసమే పోరాటం చేశామని.. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




