– మంత్రి శ్రీధర్ బాబు
– చర్లపల్లి డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మేడ్చల్/ఉప్పల్/కాప్రా, ప్రజాతంత్ర , ఫిబ్రవరి 10: చర్లపల్లి డివిజన్‌లో రూ.19 కోట్ల 36 లక్షల వ్యయంతో అభివృద్ధి నిర్మాణ పనులకు ఐటీ & పరిశ్రమల శాఖ, మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి , డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. చర్లపల్లి డివిజన్‌లో రూ.19 కోట్ల 36 లక్షల నిధుల వ్యయంతో ప్రధాన అభివృద్ధి నిర్మాణ పనులకు రూ.3.75 కోట్లతో డీమార్ట్ రోడ్ మీదుగా పోచమ్మ ఆలయం వరకు, అక్కడి నుంచి కృష్ణారెడ్డి నగర్ ఆర్చ్ వరకు ఆర్ సి సి బాక్స్ డ్రెయిన్ నిర్మాణం, రూ.2.85లక్షలతో సాయినగర్ ఆర్చ్ నుంచి టి ఐ ఎఫ్ ఆర్ కంపౌండ్ వాల్ & కృష్ణారెడ్డి నగర్ రోడ్ నెం.1, 2 వరకు ఆర్ సి సి బాక్స్ డ్రెయిన్ నిర్మాణం, రూ.3.13 కోట్లతో శ్రీ సాయి వెంకట్ ఎన్‌క్లేవ్, శివ సాయి నగర్, శ్రీనివాస ఎన్‌క్లేవ్, వి ఎన్ రెడ్డి నగర్, సుబోధయ కాలనీ, నాగార్జున నగర్, సోనియా గాంధీ నగర్, వైష్ణవి ఎన్‌క్లేవ్, సాయి కృష్ణ నగర్, ఇందిరా నగర్, నెహ్రూ నగర్ లలో సీసీ రోడ్ల నిర్మాణం. రూ.1.26 కోట్లతో జె ఎం ఆర్ అపార్ట్‌మెంట్స్ నుంచి శివ సాయి గార్డెన్స్ వరకు 600 మిమీ వ్యాసం గల RCC NP3 ఆర్ సి సి ఎన్ పి 3 పైపు డ్రెయిన్ నిర్మాణం, రూ.5.50 కోట్లతో చిన్న చర్లపల్లి వార్డు నెం.03 లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సమాధి స్థలాల మోడల్ గ్రేవ్‌యార్డ్ అభివృద్ధి,. రూ.2.87 కోట్లతో లోకమాత కాలనీ, విద్యా మారుతి కాలనీ, ఐజి కాలనీ, శివ సాయి నగర్, అంబేడ్కర్ నగర్, జ్యోతి నగర్, మధుసూదన్ రెడ్డి నగర్‌లలో సీసీ రోడ్ల నిర్మాణం, స్టాండింగ్ కౌన్సిల్‌లో డివిజన్ సమస్యలను ప్రస్తావిస్తూ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్ కి డివిజన్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




