– ధాన్యం దిగుబడి, కొనుగోలులో మనకు మనమే సాటి
– నదీ జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షిస్తాం
– మట్టపల్లి లక్ష్మీనరసింహుడి ప్రాశస్త్యాన్ని పెంపొందిస్తాం
– రూ.80 కోట్లతో హుజూర్‌గర్-మట్టపల్లి రహదారి విస్తరణ
– రాజకీయాలలో పరిణతి చెందిన నేత గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, జనవరి 23: హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో రూ.123 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన వ్యవసాయ కళాశాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకోవడం చరిత్రలో పదిలంగా నిలిచిపోతుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం జరిగిన శంకుస్థాపనను అద్భుతమైన ఘట్టంగా అభివర్ణించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది పర్వదినం రోజున హుజుర్‌నగర్ నియోజకవర్గ కేంద్రం నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో కోదాడలో ఏర్పాటు చేయనున్న జవహర్ నవోదయ విద్యాలయంతో ఎస్‌సి, ఎస్‌టి, బీసీ¾, మైనారిటీ, ఈబీసీ విద్యార్దులలో వెలుగులు నింపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచం నలుమూలల ఎక్కడికి వెళ్లినా నిలదొక్కుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకే రెండో తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో విద్యావకాశాలు కల్పించేందుకే కోదాడలో ప్రత్యేకించి జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణకు తెలంగాణయే సాటి
ధాన్యం దిగుబడిలో తెలంగాణకు తెలంగాణయే సాటిగా నిలబడిందని, కొనుగోలులోనూ తెలంగాణ సంచాలనాత్మక రికార్డులను నమోదు చేసుకుందని చెప్పారు. తాజాగా ఖరీఫ్ సీజన్‌లో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే ప్రభుత్వం 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం దేశ చరిత్రలోనే అరుదైన రికార్డుగా నమోదైందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు అందించే బోనస్‌తో కలిపి రూ.19,000 వేల కోట్ల మద్దతు ధరను నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నదన్నారు. గత పాతికేళ్లలో ఇంతకు ముందెన్నడూ ఇంతటి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర జనాభాలో 85% మంది ప్రజలకు ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ విప్లవాత్మకమైన నిర్ణయమన్నారు. అదే సమయంలో అర్హులైన నిరుపేదలందkతీjw తెల్ల రేషన్ కార్డుల మంజూరు అనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనన్నారు. జలాశయాలలో తెలంగాణ హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, తెలంగాణ హక్కులకు భంగం కలిగించే ఏ ప్రయత్నానైనా గట్టిగా ప్రతిఘటిస్తామని ఆయన తెలిపారు. చరిత్రాత్మక లక్ష్మీనరసింహ స్వామి ప్రాశస్త్యాన్ని మరింత ఇనుమడింప చేసే విదంగా చర్యలు చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ-ఆంధ్రల మధ్యన కృష్ణా నదిపై వంతెన నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యాత్రికుల సౌకర్యార్థం రూ.80 కోట్లతో హుజుర్‌నగర్-మట్టపల్లి రహదారి విస్తరణ పనులతోపాటు ఆలయ సన్నిధిలో డార్మిటరీ, వంటశాý నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. రాజకీయాలలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పరిణతి చెందిన నేత అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా రాణించిన నాయకుడని, అలాంటి నేత గవర్నర్ హోదాలో మారుమూల ప్రాంతమైన మట్టపల్లికి రావడం చరిత్రాత్మక సందర్భమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే