లండన్ లో డా. బి ఆర్ అంబేడ్కర్ హౌస్ సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు 

లండన్ లో డా. బి ఆర్ అంబేడ్కర్ హౌస్ సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు గ్రేస్ ఇన్‌లో విద్యనభ్యసించిన రోజుల్లో డా. బి.ఆర్. అంబేడ్కర్ నివసించిన కింగ్ హెన్రీ రోడ్ లో ఉన్న అంబేడ్కర్ హౌస్ ను పర్యటనలో భాగంగా మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు బాబాసాహెబ్‌కు హృదయపూర్వక నివాళులు అర్పించి, ఆయన వారసత్వాన్ని, దూరదృష్టిని గౌరవిస్తూ సందర్శకుల పుస్తకంలో సందేశం రాశారు. ఆ తరువాత ఆయన సోషల్ మీడియా ద్వారా సందేశం పంచుకుంటూ, అంబేడ్కర్ చూపిన సమానత్వం, న్యాయం, సాధికారత సిద్దాంతాలు సమగ్ర భారత నిర్మాణానికి, న్యాయబద్ధమైన ప్రపంచానికి మార్గదర్శకంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *