ఎంఐఎం మాజీ కార్పొరేటర్‌ ‌మహమ్మద్‌ ‌గౌస్‌ ‌కుమారుడి అరెస్ట్

– అధికారుల విధులకు ఆటంకం క‌లిగించినందుకు

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6:‌ పాత బస్తీలో చార్మినార్ ‌సమీపంలో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో ఎంఐఎం మాజీ కార్పొరేటర్‌ ‌మహమ్మద్‌ ‌గౌస్‌ ‌కుమారుడు మహమ్మద్‌ ‌సాహిల్‌ ‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. చార్మినార్‌ ‌పరిసర ప్రాంతాల్లో ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్‌ఎం‌సీ అధికారులు పోలీసుల బందోబస్తుతో అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అధికారుల పనిని అడ్డుకున్న సాహిల్‌ వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులను , జీహెచ్‌ఎం‌సీ సిబ్బందిని తోసేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. శాంతిభద్రతలను కాపాడాల్సినచోట ఒక ప్రజాప్రతినిధి కుమారుడై ఉండి అధికారులపైనే సాహిల్‌ ‌చేయి చేసుకోవడంపై పోలీసులు సీరియస్‌ అయ్యారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాక పోలీసులను తోసేస్తూ అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ అధికారుల పట్ల సాహిల్‌ ‌ప్రవర్తించిన తీరుపై పోలీసులు తక్షణమే స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, అధికారులపై దాడికి ప్రయత్నించినందుకు గాను సాహిల్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *