యూఎస్‌ ‌వీసా కోసం కాన్సులేట్‌కు మాజీ సిఎం కెసిఆర్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,మే2: యూఎస్ వీసా కోసం మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌గచ్చిబౌలిలోని అమెరికన్‌ ‌కాన్సులేట్‌ ‌కార్యాలయానికి వొచ్చారు. అమెరికా వీసా కోసం కాన్సులేట్‌ ‌కార్యాలయానికి వొచ్చారని సన్నిహితులు తెలిపారు. ఇప్పటికే సికింద్రాబాద్‌ ‌పాస్‌ ‌పోర్ట్ ‌కార్యాలయంలో పాస్‌పోర్ట్ ‌రెన్యువల్‌ ‌కోసం పత్రాలు సమర్పించారు.. ఎర్రవల్లి ఫామ్‌ ‌హౌస్‌ ‌నుంచి నేరుగా అమెరికన్‌ ‌కాన్సులేట్‌ ‌కి చేరుకున్న కేసీఆర్‌ ‌తో పాటు జోగినపల్లి సంతోష్‌, ‌జీవన్‌ ‌రెడ్డి ఉన్నారు..
ఈ ఏడాది ఫిబ్రవరి 19న కేసీఆర్‌ ‌సికింద్రాబాద్‌ ‌పాస్‌పోర్ట్ ‌కార్యాలయానికి వొచ్చిన విషయం తెలిసిందే. పాస్‌ ‌పోర్ట్ ‌రెన్యువల్‌ ‌కోసం ఆయన కార్యాలయానికి వొచ్చారు. ఆయన తన  డిప్లమాటిక్‌ ‌పాస్‌పోర్ట్ ‌ను సబ్మిట్‌ ‌చేసి సాధారణ పాస్‌పోర్ట్ ‌ను తీసుకున్నారు.  ఇప్పుడు గచ్చిబౌలిలోని అమెరికన్‌ ‌కాన్సులేట్‌ ‌కార్యాలయానికి వొచ్చారు. అమెరికాకు కెసిఆర్‌ ‌దరఖాస్తు చేశారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *