– ఇంతవరకు పబ్లిష్ కాలేదని వెల్లడి
న్యూదిల్లీ, ఫిబ్రవరి 10:మాజీ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె మంగళవారం తన పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టనీ‘ పుస్తక వివాదంపై తొలిసారిగా స్పందించారు. ప్రచురించబడని పుస్తకంపై ఇటీవల పార్లమెంట్ బ్జడెట్ సమావేశాల్లో వివాదం చెలరేగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలో మోదీ ప్రభుత్వం చైనాతో ఘర్షణ సమయంలో సమర్థవంతంగా వ్యవహరించలేదని ఉందని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో నరవాణెళి మౌనాన్ని వీడారు. ‘ఇది పుస్తక స్థితి‘ అని పుస్తక పబ్లిషర్ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా సోషల్ మీడియా పోస్టును ఆయన షేర్ చేశారు. ‘ఈ పుస్తకం ప్రచురణ హక్కులు తమవేనని, పుస్తకం ఇంకా ప్రింటింగ్‌కు వెళ్లలేదని, ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ లేదా ఏ రూపంలోనూ మేము ఎక్కడా విడుదల చేయలేదని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా వెల్లడించింది. ఇదే సమయంలో ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతున్న అనధికారిక ప్రింట్లు కాపీ రైట్ ఉల్లంఘన కిందకు వస్తాయని, వెంటనే వాటిని ఆపాలని చెప్పింది. ఇప్పుడు ఇదే విషయాన్ని నరవాణె కూడా చెబుతున్నారు.కొన్ని రోజల క్రితం రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో ఈ పుస్తకం కాపీని చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2020 లడఖ్‌లో భారత్-చైనా ఘర్షణ సమయంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేదనే విషయాలు ఇందులో ఉన్నాయని ఆరోపణలు చేశారు. ఈ పుస్తకం అధికారికంగా విడుదల కాలేదని చెబుతూ లోక్‌సభలో రాహుల్ గాంధీని ఈ పుస్తకంలోని భాగాలను చదివేందుకు అనుమతించలేదు. మరోవైపు ఇంకా పబ్లిష్ కాని పుస్తకం అక్రమంగా పంపిణీ చేయడంపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





