లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అట‌వీశాఖ అధికారులు

పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: పరిగి అటవీ శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపి సెక్ష‌న్ ఆఫీస‌ర్లు లంచం తీసుకుంటుండగా పట్టుకుని కేసులు నమోదు చేశారు. సీతాఫలాల టెండర్ల పర్మిట్ల విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రంగారెడ్డి రేంజ్ జిల్లా అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కుల్కచర్ల రేంజ్ లో సీతాఫలాల తరలింపు కోసం గోపాల్ అనే వ్యక్తి రూ.18 లక్షలకు టెండర్ చేజిక్కించుకున్నాడని,సీతా ఫలాల తరలింపు పర్మిట్ల కోసం భాధితుడి వద్ద సెక్షన్ ఆఫీసర్లు రూ.50 వేల  లంచం డిమాండ్ చేయగా బాధితుడు తమను ఆశ్రయించాడని తెలిపారు.  సీతాఫల్ టెండర్ల పర్మిట్ల విషయంలో రూ.40 వేలు లంచాన్ని కారు డ్రైవర్ బాలకృష్ణ  ద్వారా తీసుకున్నట్లు, సెక్షన్ ఆఫీసర్లు మొయినోద్దిన్,సాయికుమార్ లను రెడ్ హ్యాండేడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లతో పాటు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page