విదేశీ విద్యార్థులపై ట్రంప్‌  ‌కొరడా

– పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు అడ్మిషన్లు
– యూనివర్సిటీలకు హుకుం జారీ చేసిన వైట్‌హౌజ్‌

‌వాషింగ్టన్‌,అక్టోబర్‌ 3: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌మరో హుకుం జారీ చేశారు. విదేశీ విద్యార్థుల రాకపై ఆంక్షలు లాంటి కత్తి పెట్టారు. పరిమిత సంఖ్యలో వారిని అనుమతించాలని యూనివర్సీటీలను ఆదేశించారు. అమెరికా ప్రభుత్వ నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను పరిమితం చేయాలని వైట్‌ ‌హౌజ్‌  ‌విశ్వవిద్యాలయాలకు తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రతిపాదించిన నిబంధనలను మెమో రూపంలో దేశంలోని ప్రధాన యూనివర్శిటీలకు పంపింది. ప్రభుత్వ నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల సంఖ్య పై పరిమితి, జాతి, లింగ ఆధారిత నియామకాలు నిలిపివేయడం, విద్యార్థుల అడ్మిషన్‌ ‌సమయంలో కచ్చితంగా ప్రామాణిక పరీక్ష నిర్వహించడం వంటివి చేపడితేనే ప్రభుత్వ నిధుల కేటాయింపులో ప్రాధాన్యం లభిస్తుందని వెల్లడించింది. ఈ నిబంధనలను అంగీకరించిన విశ్వవిద్యాలయాలు ప్రభుత్వం నుంచి వొచ్చే లబ్ధి పొందవచ్చని ఆ లేఖలో వెల్లడించారు. వీటిల్లో విద్యార్థులకు ప్రభుత్వ రుణాలు, గ్రాంట్లు, కాంట్రాక్టులు, రీసెర్చి నిధులు, విదేశీ స్కాలర్స్‌కు వీసా అనుమతులు, ట్యాక్స్ ‌కోడ్‌లో ప్రాధాన్యం వంటివి పొందవచ్చని పేర్కొంది. అమెరికాలో ఉన్నతవిద్యను పునర్‌ ‌వ్యవస్థీకరించి తమ భావజాలానికి అనుకూలం గా మార్చుకోవడానికి ట్రంప్‌ ‌కార్యవర్గం చేస్తున్న మరో యత్నంగా దీనిని భావిస్తున్నారు. హార్వర్డ్ ‌విశ్వవిద్యాలయం ప్రభుత్వంతో 500 మిలియన్‌ ‌డాలర్ల డీల్‌ ‌చాలా దగ్గరగా ఉందని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌ ‌నుంచి లేఖలు అందుకొన్న వాటిలో అమెరికాలోని ఎంఐటీ సహా ప్రముఖ విశ్వవిద్యాలయాలు మొత్తం ఉన్నాయి. ఈ క్రమంలో విదేశీ వీసాలపై వొచ్చే విద్యార్థుల సంఖ్య 15 శాతానికి మించి ఉండకూడదు. ఒకే దేశం నుంచి వొచ్చిన విద్యార్థుల సంఖ్య 5 శాతానికి మించకూడదు. విదేశాల నుంచి అందే నిధుల వివరాలను బహిర్గతం చేయాలి. విద్యార్థుల అడ్మిషన్‌,ఫైనాన్షియల్‌ ఎయిడ్‌ ‌సమయంలో లింగ, జాతి, జాతీయత, రాజకీయ భావజాలం, జెండర్‌ ఐడెంటిటీ, లైంగిక ఆకర్షణ, మతపరమైన అంశాలు పరిగణనలోకి తీసుకోకూడదు.అండర్‌ ‌గ్రాడ్యుయేట్‌ ‌దరఖాస్తుదారులు కచ్చితంగా ప్రామాణిక పరీక్షను పూర్తిచేయాల్సిందే. విద్యా స్వేచ్ఛను కాపాడే విధానాలు అమలు చేయాలి. సంప్రదాయవాద ఆలోచన సరళిని ఇబ్బందిపెట్టే, దాడులకు పాల్పడే యూనిట్స్‌ను తొలగించడం వంటివి ఉన్నాయి. విద్యాలయాలను ఇబ్బందిపెట్టేలా రాజకీయ ప్రదర్శనలు, విద్యార్థులను లేదా గ్రూపులను వేధించకుండా చర్యలు చేపట్టాలి. ఉద్యోగులు అధికారిక విధుల సమయంలో రాజకీయ ప్రసంగాలు, చర్యలకు దూరంగా ఉండాలి. బాత్‌రూమ్‌లు, లాకర్‌ ‌రూమ్‌లు లింగ ఆధారంగా వేర్వేరుగా ఉండాలి. హార్డ్‌సైన్స్ ‌విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉచిత ట్యూషన్‌ ‌ఫీజ్‌, ‌ప్రోత్సాహకం కింద 2 మిలియన్‌ ‌డాలర్లు మించి ఇవ్వాలని ప్రతిపాదించారు.
ఈ నిబంధనలు ఏమేరకు అమలుచేస్తున్నారనే అంశాన్ని జస్టిస్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ‌ప్రిన్సిపల్స్‌ను సవి•క్షించి తెలుసుకొంటుంది. వీటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వ లబ్దిని రెండేళ్లపాటు ఆపేస్తారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *