మన విదేశాంగ విధానం అమెరికాకు తాక‌ట్టు

– ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా పెత్తమేంటి?
– ఎన్‌స్టీన్‌ ‌ఫైల్స్‌లో దొరికి పోవడంతోనే అమెరికాకు దాసోహం
– లోక్‌సభలో రాహుల్‌ ‌గాంధీ ఘాటు విమర్శలు

న్యూదిల్లీ, మార్చి 12: భారత విదేశాంగ విధానన్ని మోడీ అమెరికాకు తాకట్టు పెట్టారని విపక్షనేత రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. రష్యా నుంచి చమురు దిగుమతులకు అమెరికా అడ్డంకులేంటని ప్రశ్నించారు. మనం చమురు ఎక్కడ కొనాలో అమెరికా నిర్ణయిస్తుందంటే మన విదేశాంగ విధానం తాకట్టు పెట్టినట్లేనన్నారు. హర్మూజ్‌ ‌జలసంధి నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు జరగాల్సి ఉంది. యుద్ధం కారణంగా  దిగుమతులు ఆగిపోయాయి. ఇది ఆరంభం మాత్రమే. గ్యాస్‌ ‌కొరతతో దేశం అల్లాడుతోంది. మనం ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా నిర్ణయిస్తోంది. రష్యా నుంచి చమురు కొనాలో వద్దో మనకు మనం నిర్ణయించుకోవాలి. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా జోక్యం ఎందుకు.. భారత్‌ ‌వంటి పెద్ద దేశానికి మరో దేశం అనుమతి ఎందుకు? ఇలా ఎందుకు జరుగుతోందా అని ఆలోచించాను. నా ప్రశ్నకు సమాధానం ఎన్‌స్టీన్‌ ‌ఫైల్స్ ‌రూపంలో దొరికింది. ఎప్‌స్టీన్‌ ‌ఫైళ్ల ప్రభావం ఎల్‌పీజీ దిగుమతులపై పడినట్లు ఉంది. ఎప్‌స్టీన్‌తో సంబంధాలను పెట్రోలియం మంత్రే అంగీకరించారని రాహుల్‌ ‌వ్యాఖ్యలు చేశారు. ఇవి దుమారం రేపాయి. దీంతో స్పీకర్‌ ఓం ‌బిర్లా స్పందించారు. నోటీసు ఇచ్చిన అంశంపైనే మాట్లాడాలని సూచించారు. సభ్యుల ఇష్టాఇష్టాల మేరకు సభ నడవదని స్పష్టం చేశారు. ఇదే అంశంపై పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ ‌సింగ్‌ ‌పురీ ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. ఎప్‌స్టీన్‌ అం‌టూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఆ గందరగోళం మధ్యే మంత్రి మాట్లాడారు. ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయిల్‌ ‌యుద్ధం నేపథ్యంలో గ్యాస్‌ ‌కొరతతో భారతదేశం అల్లాడుతోందని రాహుల్‌ ‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి మోదీ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుందన్నారు. అమెరికా – ఇజ్రాయిల్‌, ఇరాన్‌ ‌యుద్ధంలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు 20 శాతం చమురు హార్ముజ్‌ ‌జల సంధి నుంచి వస్తుందని వివరించారు. ప్రస్తుతం ఆ జల సంధిని మూసివేశారని పేర్కొన్నారు. గ్యాస్‌ ‌కొరత కారణంగా దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు మూతపడ్డాయని చెప్పారు. ఎల్పీజీ గ్యాస్‌ ‌కొరత నేపథ్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు. దేశానికి పునాది ఇంధన భద్రత అని అభివర్ణించారు. భారత్‌ ‌వ్యవహారాలను అమెరికా శాసిస్తోందని మండిపడ్డారు. యూఎస్‌ అనుమతి లేకుంటే ముడి చమురు కొనుగోలు చేయ్యరా అంటూ వ్యంగ్యంగా కేంద్రాన్ని నిలదీశారు. పెట్రోలియం మంత్రికి ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నాయని ఆరోపించారు. వెంటనే రాహుల్‌ ‌మైక్‌ను స్పీకర్‌ ఓం ‌బిర్లా కట్‌ ‌చేశారు. అంతలో సభలోని హర్దీప్‌ ‌సింగ్‌ ‌స్పందిస్తూ రాహుల్‌ ‌వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హర్దీప్‌సింగ్‌ ‌ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం ‌బిర్లా ప్రకటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *