ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం…

నిద్రలేమి అనేది ఒక నిద్ర రుగ్మత. ఇందు నిద్రపోవడం లేదా కోరుకున్నంత సేపు నిద్రపోవడం కష్టంగా ఉండవొచ్చు. నిద్రలేమి శరీర, మానసిక,  భావోద్వేగ పరిధుల్లో చాలా ప్రభావాలు చూపిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గింపు..  ఇన్‌మ్యూన్‌ సిస్టమ్‌ బలహీనపడుతుంది. దాని వలన వ్యాధులు సులువుగా చేరవొచ్చు.  జీర్ణ సమస్యలు..  కడుపులో మంట, అజీర్ణం మొదల్కెన సమస్యలు రావొచ్చు.  గుండె సంబంధిత వ్యాధులు .. రక్తపోటు పెరగడం, గుండెజబ్బులు మొదల్కెనవి వచ్చే ప్రమాదం ఉంటుంది. మెటబాలిజంలో మార్పులు..శరీర బరువు పెరగడం, డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. నరాల సంబంధిత సమస్యలు..  చెడు నిద్ర వల్ల తలనొప్పులు, మైగ్రేన్‌ సమస్యలు పెరిగే అవకాశముంది. హార్మోన్ల అసంతులనం.. గ్రీలిన్‌ మరియు లేప్టిన్‌ వంటి హార్మోన్ల స్థాయి మార్పు, ఆకలి నియంత్రణలో మార్పులు.

 

మానసిక ప్రభావాలు.. మేధస్సు పనితీరు తగ్గడం.. ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి తగ్గడం, నిర్ణయం తీసుకోవడంలో సమస్యలు రావొచ్చు. ఆలోచనా లోపాలు.. సరిగ్గా ఆలోచించలేకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం. క్రియేటివిటీ తగ్గడం.. సృజనాత్మక ఆలోచనలు చేయడంలో సమస్యలు రావొచ్చు. సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోవడం..  ఆలోచనా తత్వం సరిగా పనిచేయకపోవడం వలన తప్పులు చేయడం జరుగుతుంది. భావోద్వేగ ప్రభావాలు.. తీవ్ర భావోద్వేగాలు.. ఒత్తిడి, డిప్రెషన్‌, ఆందోళన పెరగవొచ్చు.  మూడ్‌ స్వింగ్స్‌.. .. అనూహ్యమైన కోపం, నిరాశ, నిస్పృహత వంటి భావోద్వేగ మార్పులు కలగొచ్చు. సామాజిక సంబంధాలు తగ్గడం.. కుటుంబ, స్నేహితుల మధ్య సాన్నిహిత్యం తగ్గడం. ఎమోషనల్‌ రెగ్యులేషన్‌.. భావోద్వేగాలను నియంత్రించడంలో సమస్యలు, చిన్న విషయాలపై అత్యధికంగా స్పందించడం.

 

ఇతర ప్రభావాలు.. నిద్ర చక్రంలో మార్పు..  నిద్రపోవడానికి మరియు మేలుకొలిపి సమయంలో మార్పులు రావడం.  సమర్థత తగ్గడం..  పాఠశాల, పనిలో సమర్థత తగ్గడం. నిద్ర సంబంధిత రుగ్మతలు..  నిద్రలేమి కొనసాగితే, నిద్రలో నడవడం, నిద్రలో మాట్లాడడం వంటి రుగ్మతలు రావొచ్చు. చాలామంది ఎలా మానసికంగా దృఢంగా ఉండాలి, చిన్న చిన్న వాటికే ఎమోషనల్‌ అవ్వడం ఎలా కంట్రోల్‌ చేయాలి? అనుకుంటూవుంటారు. అదే మీ తత్వమా లేదా  అన్నది బహుశా నిర్ధారించవలసిన ఒక ముఖ్య విషయం చిన్న చిన్న విషయాలకే అన్నారు కదా..

ఏది చిన్నది ఏది పెద్దది అన్న విషయం కూడా మూకుమ్మడిగా (అంటే మూసగా) నిర్ధారించేయడం కరక్ట్‌ కాకపోవొచ్చు. కరక్టే మన చుట్టూ వున్న వాళ్లలో కొంతమంది ఎక్కువ పరిణతి తో వ్యవహరిస్తున్నట్లు (పైకి) కనపడతారు. అలాగే మన చుట్టూ వున్న వాళ్లలో కొంతమంది ఎక్కువ భావావేశాలు ప్రదర్శిస్తారు .. కానీ ఎవరి లోలోపల ఎటువంటి పరిస్థితి వున్నదో కేవలం నిపుణులే అదీ ప్రత్యక్ష సంభాషణతోనే కాస్తో కూస్తో తెలుసుకోగలరు. తెలిసీ తెలియని వాళ్ళు ఎన్న్కెనా చెబుతారు – ఏవైనా చెబుతారు. దాని వలన జనులు పడే కన్ఫ్యూషన్‌ ఎటూ ఉంటుంది .  అదే బహుశా మానసిక విషయాల్లో ఒక పెద్ద ప్రాబ్లెమ్‌ కూడా..

వృద్ధాప్యానికి వస్తే జిహ్వచాపల్యం పెరుగుతుందా ?
జిహ్వచాపల్యం వృద్ధాప్యంలో తగ్గుతుంది. వారు తినగలిగిన పదార్ధాలు కూడా తగ్గిపోతాయి. ఫంక్షన్స్‌ లో 25 ఐటమ్స్‌ వుంటే రెండు మూడిటి కంటే దాటి మిగిలిన వాటిని తినలేరు. తినేందుకు కూడా ఆశపడరు. అయితే వృద్దులు తమ సంతానం దగ్గర వున్నప్పుడు వీరికి నచ్చిన ఐటమ్స్‌ ఒకటి రెండు కూడా దొరకని పరిస్థితి ఉండవొచ్చు. పిల్లలకు చేసి పెట్టేందుకున్న ప్రాముఖ్యత సహజంగానే పెద్ద వాళ్ళ మీద ఉండదు. రెండోది వాళ్లు అడిగిన ఐటమ్‌ తిని వంట్లో తేడా తెచ్చుకుంటారేమో అనే కంప్లైంట్‌ ఉండనే ఉంటుంది. పెద్ద వాళ్లంటే చాలా తక్కువ కోరికలు, అభిరుచులు కల్గి ఉండాలనే అభిప్రాయంతో పిల్లలు వుంటారు. నిజానికి బిరియానీలు, స్వీట్స్‌ వంటి పదార్ధాల జోలికి అసలు పోనే లేరు.
 -కె.లతాశ్రీనివాస్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *