– కలుషితాహారంతో 15 మంది విద్యార్థులకు అస్వస్థత
జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వహాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మంగళవారం ఉదయం అల్పాహారం తిన్న విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు వెళ్లారు. అరగంట అనంతరం విద్యార్థులకు వాంతులు కావడంతో వారిని హాస్పిటల్‌కి తరలించారు. ఉదయం పెట్టిన ఉప్మాలో పురుగులు వొచ్చాయని, ఆ విషయాన్ని వార్డెన్‌కు చెప్పడంతో పారవేశారని విద్యార్థులు తెలిపారు. ఆ తర్వాత అరటిపళ్లు, బిస్కెట్లు తిని స్కూల్‌కి వెళ్లారు. కొద్దిసేపటికే కడుపునొప్పి, వాంతులైనట్లు విద్యార్థులు చెబుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




