కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు

– కుళ్లిన గుడ్లతో ఎగ్‌ ప‌ఫ్స్‌తయారీ
– పాత బస్తీ కుల్సుంపురాలో అధికారుల దాడి
– నిర్వాహ‌కుడి అరెస్ట్

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 21: కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ ‌తయారు చేసి నగరంలోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడిని అధికారులు అరెస్ట్ ‌చేశారు. అబ్దుల్‌ అనే వ్యక్తి అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం పదార్థాలతో తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో పాడైన, నాసిరకం ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు కేసు నమోదు చేసి అబ్దుల్‌ను అరెస్ట్ ‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో కుల్సుంపురా ప్రాంతంలో తయారవుతున్న ఫుడ్‌ ఐటమ్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను హైదరాబాద్‌ ‌పోలీసులు సోషల్‌ ‌మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియోలో అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారవుతున్న ఆహారం కనపడుతుంది. హైదరాబాద్‌ ‌ఫుడ్‌ అడల్టేష్రన్‌ ‌సర్వేలేన్స్ ‌టీం, టాస్క్‌ఫోర్స్ ‌సిబ్బంది, కులసుంపుర పోలీస్‌ ‌సమన్వయంతో ఈ దాడి చేపట్టారు. ఈ దాడిలో 73 ఏళ్ల అబ్దుల్‌ ‌రషీద్‌ అనే వ్యక్తి ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా సమోసాల తయారీ యూనిట్‌ ‌నిర్వహిస్తున్నట్లు బయటపడింది. అతనికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ‌లైసెన్స్, ‌ట్రేడ్‌ ‌లైసెన్స్, ‌సేప్టీ క్లియరెన్స్ ఏదీ లేకపోవడం గమనార్హం. దర్యాప్తులో కుళ్లిపోయిన గుడ్లు, పలుమార్లు వాడిన వంటనూనె వంటి నాసిరకం పదార్థాలతో ఆహారం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ యూనిట్‌లో అపరిశుభ్ర పరిస్థితుల్లో సమోసాలు, ఇతర ఫుడ్‌ ఐటమ్స్ ‌తయారు చేసి నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. దాడి సమయంలో సుమారు రూ.5 లక్షల విలువైన నాసిరకం ఆహార పదార్థాలు, ముడి సరకులు, యంత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో వివిధ రకాల సమోసాలు, మైదా, స్వీట్‌ ‌కార్న్ ‌వంటి ముడి పదార్థాలు కూడా ఉన్నాయి. నిందితుడు అబ్దుల్‌ ‌రషీద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ ‌సిటీ పోలీసులు ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని సూచించారు. హోటళ్లకు సరఫరా చేసే ఆహార పదార్థాల నాణ్యతపై కఠినంగా పర్యవేక్షణ కొనసాగిస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *