– నీతి అయోగ్ కేంద్ర ప్రభారీ అధికారి అన్వేష్‌కుమార్
ములుగు, ప్రజాతంత్ర, నవంబర్ 7: అభివృద్ధి సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లను గుర్తించాలని, ప్రజల జీవితాల్లో త్వరితగతిన మార్పు తీసుకురావాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభారీ అధికారి, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అన్వేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కన్నాయిగూడెం బ్లాక్ కార్యక్రమంపై ఆయన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్‌రావులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కన్నాయిగూడెం బ్లాక్ అభివృద్ధికి సంబంధించి నిర్దేశించిన ఐదు ప్రధాన రంగాలలో సాధించిన ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు ప్రథమ త్రైమాసికంలో నమోదు, సంస్థాగత ప్రసవాలు, పిల్లల్లో పోషకాహార లోపం (ఎస్‌ఎం, /ఎంఏఎం) తగ్గింపు అంగన్వాడీ కేంద్రాల్లో సదుపాయాల లభ్యత వంటి అంశాలను సమీక్షించారు.వ్యవసాయం అనుబంధ సేవలు కిసాన్ క్రెడిట్ కార్డు పంపిణీ, సూక్ష్మ నీటిపారుదల విస్తీర్ణం, సాయిల్, హెల్త్ కార్డుల జారీ పశువులకు టీకాలు వేసే కార్యక్రమాలపై దృష్టి సారించారు. మౌలిక సదుపాయాలు, ప్రతి ఇంటికీ కుళాయి నీటి కనెక్షన్, ఓపెన్ డెఫెకేషస్ ఫ్రీ ప్లస్ గ్రామాల ప్రకటన, భారత్ నెట్ కనెక్టివిటీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. సమాజ అభివృద్ధి, స్వయం సహాయక బృందాలకు, రివాల్వింగ్ ఫండ్ మంజూరు, కొత్త ఎస్‌హెచ్‌జి ఏర్పాటు, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాల అమలును సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర పథకాల కలయిక, కేంద్ర ప్రభారీ అధికారులు, జిల్లా కలెక్టర్ల సహకార ంబ్లాక్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ అనే మూడు ప్రధాన సూత్రాలపైనే ఆకాంక్షిత్ బ్లాకుల కార్యక్రమం విజయం కావడం ఆధారపడి ఉందన్నారు. కన్నాయిగూడెం బ్లాక్‌లో పథకాల అమలులో అధికారుల అంకితభావం అభినందనీయం. అయినప్పటికీ కీలక సూచికలలో మరింత వేగంగా అభివృద్ధి సాధించడానికి ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులు, నీతి అయోగ్ బ్లాక్ కోఆర్డినేటర్ రవీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




