వరద పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన సీఎం 

– మూసీ పరీవాహకం వెంట జాత్త్రలు తీసుకోవాలి
– ఎంజీబీఎస్‌లోకి వరద.. పరిస్థితి సమీక్షించిన ముఖ్యమంత్రి
– అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27 : వరుసగా వర్షాలు, వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీకి వరద నీటి ప్రవాహం పెరగటంతో మూసీ పరీవాహకం వెంట ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూసీ వెంట లోతట్టు ప్రాంతాలన్నింటా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైనచోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అర్ధరాత్రి ఇమ్లిబన్‌ సమీపంలోని ఎంజీబీఎస్‌ బస్టాండ్‌ చుట్టూ నీళ్లు రావటంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం స్వయంగా సమీక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడినుంచి బయటకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ కావటంతో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలన్నారు. వరుసగా రెండో రోజు కూడా హైదరాబాద్‌లో భారీ వర్ష సూచన ఉండటంతో పోలీస్‌, ట్రాఫిక్‌, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సిటీలో నీళ్లు నిలిచే ప్రాంతాలు, మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని, అటువైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *