ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులు నిలిపివేత

 – ఎయిర్ ఇండియా వెల్లడి

న్యూదిల్లీ, ఏప్రిల్ 6 : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవు వెళ్లే సర్వీసులను, అక్కడి నుండి వచ్చే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రక టించింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రతను దష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఈ కాలడా లో ప్రయాణానికి ఇప్పటికే టికెట్లు బుక్ చేస కున్న వారికి పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లి స్తామని, లేదా ఒకసారి ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామని ప్రకటిచింది. మే 31 తర్వాత అప్పటి పరిస్థి తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *