రాజ్‌భవన్‌లో జెండా ఎగరేసిన గవర్నర్‌

‌తెలంగాణ వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌, ‌మండలిలో ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలను గురించి వివరించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌గద్వాల విజయలఁ్‌మి జాతీయ జెండా ఎగురవేశారు. వివిధ నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు జెండా ఎగురవేశారు. వివిధ జిల్లా కార్యాలయాల ఎదుట ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పతాకావిష్కరణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాల ప్రాంగణాలు మువ్వన్నెల జెండాలతో మెరిసిపోయాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు జెండా ఎగురేసి ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. హైకోర్టులో చీఫ్‌ ‌జస్టిస్‌ ‌జెండా ఎగురేశారు. ఈకార్యక్రమానికి న్యాయవాదులు, న్యాయమూర్తులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *