– మాలిలో ఐదుగురు భారతీయల కిడ్నాప్
న్యూదిల్లీ, నవంబర్ 8: ఆఫ్రికా దేశం మాలిలో ఐదుగురు భారతీయులను ఉగ్రమూకలు కిడ్నాప్ చేశాయి. ఇది అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న మూకల పనేనని అక్కడి వార్గాలు చెబుతున్నాయి. స్థానికంగా ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టు చేపడుతున్న సంస్థలో ఆ ఐదుగురు పనిచేస్తున్నారు. వారు కిడ్నాప్‌కు గురైన విషయాన్ని సంస్థ ధ్రువీకరించింది. రాజధాని బొమాకోలోని మిగతా భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ విషయంపై అక్కడి ఉగ్రవాద సంస్థలు ఏవీ ఇంకా స్పందించలేదు. మాలిలో ప్రస్తుతం మిలటరీ జంటా పాలన సాగుతోంది. మరోవైపు అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలకు అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్రమూకలు దేశంలో రణరంగం సృష్టిస్తున్నాయి. వారికి అడ్డుకట్ట వేయలేక సైన్యం సతమతమవుతోంది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న దేశంలో అంతర్గత కుమ్ములాటలు పరిస్థితిని నానాటికీ దిగజారుస్తున్నాయి. అల్ ఖైదా అనుబంధ జేఎన్‌ఐఎమ్ ఉగ్రసంస్థ దేశంలోకి ఇంధనం రాకుండా అడ్డుకోవడంతో అవస్థలు తీవ్రమయ్యాయి. మాలిలో విదేశీయుల అపహరణలు నిత్యకృత్యంగా మారాయి.సెప్టెంబర్‌లో కూడా జేఎన్‌ఐఎమ్ ఉగ్రవాదులు విదేశీయులను కిడ్నాప్ చేశారు. యూఏఈకి చెందిన ఇద్దరిని, ఒక ఇరాన్ దేశస్థుడిని బొమాకోకు సవిూపంలో కిడ్నాప్ చేశారు. 50 మిలియన్ డాలర్లు ఇచ్చాక వారిని విడిచిపెట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





