మధ్యాహ్న భోజనంలో చేపల ఆహారం !

– మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

– ఎన్నడూ లేనివిధంగా రూ.123 కోట్ల బడ్జెట్‌ కేటాయింపు
– మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్య శాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు రూపాందించామని, మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్య, క్రీడల శాఖల మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నేషనల్‌ ఫిషరీస్‌ డెవలపనమెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో హెచనఐసీసీ నోవాటెలనలో మంగళవారం ఏర్పాటు చేసిన వరల్డ్‌ ఆక్వా కల్చర్‌ ఇండియా-2025 కాన్ఫఫెరెన్స్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరెయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్య శాఖకు దాదాపు రూ.123 కోట్ల బడ్జెట్‌ కేటాయించామని చెప్పారు. మధ్యాహ్న భోజనం పథకంలో చేపల ఆహారం అమలయ్యేలా సీఎం రేవంత్‌ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా మత్స్య శాఖపై రూపొందించిన పాటను మంత్రి సమక్షంలో విడుదల చేశారు. మత్స్య సంపద, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధిపై ప్రధాన చర్చ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మత్స్య శాఖ స్టాళ్లను మంత్రి వాకిటి పరిశీలించారు. మత్స్యకారుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి ఇప్పటివరకు మత్స్య శాఖను ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వలేదని, మొదటిసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిందని చెప్పారు. గతంలో నిర్వీర్యానికి గురైన మత్స్య శాఖను పునర్నిర్మాణం చేస్తూ తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి కేబినెట్లో సమావేశంలోనేజూఊ మత్స్య శాఖకు దాదాపు రూ.123 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్లు తెలిపారు. మత్స్యకారులందరి తరపున సీఎం రేవంత్‌ రెడ్డికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. రూ.కోటి 40 లక్షలతో మత్స్యకారులకు ఇన్సూరెన్స్‌ కల్పించినట్లు తెలిపారు. తెలంగాణ గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉండటమే కాక గొలుసు కట్టు చెరువులు ఒక గొప్ప వరం అన్నారు. ఈ నీటి వనరులు మత్స్య సంపదకు ఎంతగానో దోహద పడతాయన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 26వేల నీటి వనరుల్లో చేప పిల్లలు విడుదల చేస్తున్నామని తెలిపారు. వీటిల్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు ఉన్నాయన్నారు. పారదర్శకతకు కేర్‌ ఆఫ్‌ అడ్రెస్‌గా రిజర్వాయర్లలో అడిషనల్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో పెద్ద చెరువుల్లో ఆర్డీవో సమక్షంలో, చిన్న చెరువుల్లో ఎమ్మార్వో ఆధ్వర్యంలో చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. అంతేకాక చేప పిల్లల పంపిణీకి సంబధించిన వివరాలు తెలియజేస్తూ చెరువు వద్ద సైన్‌ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌, తెలంగాణ ఫిషరీస్‌ డైరెక్టర్‌ నిఖిల, ఎననఎఫ్‌డీబీ సీఈఓ బెహరా, జాయింట్‌ సెక్రటరీ నీతు కుమారి, డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఐకార్‌ జాయ్‌ కృష్ణ, పీవీఎన్‌ఆర్‌ వెటర్నరీ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ జ్ఞానప్రకాష్‌, ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *