\కోహెడ‌లో అంత‌ర్జాతీయ‌స్థాయి ఫిష్ మార్కెట్‌

– 2027 క‌ల్లా పూర్తి చేస్తాం
– స్థానికుల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌న్న మంత్రి వాకిటి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20ః రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలో 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఇంటర్నేషనల్ ఎక్స్‌పోర్టు ఫిష్ మార్కెట్ స్థలాన్ని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. మార్కెట్ నిర్మాణ ప్లానింగ్ గురించి అధికారులు మంత్రికి వివరించ‌గా ప్లానింగ్ లో మార్పులపై ఆయ‌న పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మీడియాతో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ 13 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నామ‌ని, ఈ మార్కెట్ పూర్తిగా ఎయిర్ కండిషన్ అని, దుర్వాస‌న‌ వస్తుందని స్థానిక ప్రజలకు ఎలాంటి అపోహలు అవసరం లేదని అన్నారు. స్థానిక‌ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఈ మార్కెట్ నుండి గోదావరి, కృష్ణ, రాష్ట్రంలో ఉన్న 26 వేల నీటి వనరుల్లో లభించే చేపలను విదేశాలకు ఎగుమతి చేస్తామ‌ని తెలిపారు. రూ.47 కోట్లతో మార్కెట్ నిర్మాణం చేపడుతున్నాంమ‌ని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. సౌత్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా మార్కెట్ చేపట్టపోతున్నామ‌ని, 2027 మార్చి కల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామ‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, జాయింట్ డైరెక్టర్ మురళీ కృష్ణ, కుల శేఖర్, తదితర అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *