పట్టాలెక్కిన తొలి వందేభారత్‌ స్లీపర్‌

– మాల్దాలో జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని

కోల్‌కతా, జనవరి 17: భారత్‌లో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన కార్యక్రమంలో ఈ అధునాతన రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు స్లీపర్‌ రైల్లో ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. రైలు లోపలికి వెళ్లి అందులోని సౌకర్యాలను ప్రధాని పరిశీలించారు. పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా` నుంచి అస్సాంలోని గువాహటి (కామాఖ్య) మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. వందేభారత్‌ స్లీపర్‌ రైలు గంటకు 180 కి.విూ. గరిష్ఠ వేగాన్ని సాధించగలిగింది. రైల్వే భద్రత కమిషనర్‌ (సీఆర్‌ఎస్‌) సమక్షంలో కోటా (రాజస్థాన్‌) నుంచి నాగ్దా (మధ్యప్రదేశ్‌) మధ్య తుది పరీక్షలు నిర్వహించగా రైలు ఈ వేగాన్ని చేరుకుంది. గాజు గ్లాసుల్లో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా ఈ రైలింజిన్‌లో ఉంచినా.. రైలు గరిష్ఠ వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏమాత్రం నీళ్లు తొణకకపోవడాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గతంలో సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ రైల్లో 16 కోచ్‌లు ఉన్నాయి. వీటిలో ఆకర్షణీయమైన (ఏసీ) స్లీపర్‌ బెర్తులు, అధునాతన సస్పెన్షన్‌ వ్యవస్థ, నిప్పును గుర్తించే వ్యవస్థలు, సీసీటీవీ నిఘా వంటివి ఉంటాయి. విమానంలో ప్రయాణించిన అనుభూతిని కలిగించేలా ఇందులో సౌకర్యాలను ఏర్పాటుచేశారు. ఇందులో కనీస ఛార్జి రూ.960 నుంచి ప్రారంభమవుతుంది. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ వంటి వాటిని ఇందులో అనుమతించరు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *