– పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభించిన మంత్రి జూపల్లి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: తెలంగాణలో తొలిసారి సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఈ షో జరగనుంది. పర్యాటక, సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ షోను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి రంగురంగుల బెలూన్లు ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న 300మందికి హాట్ ఎయిర్ బెలూన్లలో రైడ్‌కు అనుమతి ఇవ్వనున్నారు. సాధారణ ప్రేక్షకులకు నైట్ గ్లో షో ఓపెన్‌గా ఉండనుంది. టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. వయస్సు, రైడ్ రకాన్నిబట్టి ధరలు రూ.500 నుంచి రూ.1500 వరకు ఉండనున్నాయి. కాగా, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా 13 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్నేషనల్ కైట్/స్వీట్స్ ఫెస్టివల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో సందర్శకులు ఇందులో పాలుపంచుకున్నారు. అలాగే 16, 17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





