బిష్ణోయ్‌ ‌లీగల్‌ ‌టీమ్‌పై కాల్పులు

– దిల్లీలో గ్యాంగ్‌స్టర్ల కదలికల కలకలం

న్యూదిల్లీ,ఫిబ్రవరి 25: దేశ రాజధానిలో మరోసారి గ్యాంగ్‌స్టర్ల కదలికలు కలకలం రేపాయి. తీహార్‌ ‌జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ ‌లారెన్స్ ‌బిష్ణోయ్‌ ‌లీగల్‌ ‌టీమ్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన దిల్లీలోని రోహిణి ప్రాంతంలో చోటుచేసుకుంది. లారెన్స్ ‌బిష్ణోయ్‌ ‌తరపున కోర్టు కేసులను వాదించే న్యాయవాదుల బృందం వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా లీగల్‌ ‌టీమ్‌ ‌వాహనంపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న వెంటనే దిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది గ్యాంగ్‌ ‌వార్‌లో భాగమా లేక లాయర్లను భయపెట్టడానికి చేసిన ప్రయత్నమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా, లారెన్స్ ‌బిష్ణోయ్‌ ‌గ్యాంగ్‌ ఇప్పటికే అనేక హై-ప్రొఫైల్‌ ‌హత్యలు, బెదిరింపుల కేసుల్లో నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని లీగల్‌ ‌టీమ్‌పై దాడి జరగడం సంచలనంగా మారింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *