యాదాద్రి భువనగిరి, మార్చి 28: బీబీనగర్ మండలం పరిధిలో జైన్ కంపెనీ సమీపంలో కేపాల్ వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ కారు వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారు ఇంజిన్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన కారు యజమాని అప్రమత్తమై వాహనం ఆపి, అందులో నుంచి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కానీ మంటలు వేగంగా వ్యాపించడంతో కారు మాత్రం పూర్తిగా దగ్ధమైంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



