– భారీగా ఆస్తి నష్టం
– సకాంలలో స్పందించిన అధికారులు
ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 21: ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. ఓలా ఎలక్ట్రి బైక్ షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రి బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మధిర మండలం ఆత్కూర్ వద్ద శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో మరో అగ్నిప్రమాదం జరిగింది. ఖమ్మం నగరంలోని రోటరీనగర్ ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రి బైక్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షోరూమ్‌లో ఉన్న పలు ఎలక్ట్రి బైకులు మంటలకు ఆహుతయ్యాయి. బైకుల బ్యాటరీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనపై పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు స్థానికులు సమాచారం అందజేశారు. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. చార్జింగ్ పెట్టిన సమయంలో లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని మధిర మండలం, ఆత్కూర్ సమీప ప్రాంతంలో గల శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన మిర్చి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు మంటల్లో చిక్కుకున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కోల్డ్ స్టోరేజీలో ఉండే ఇన్సులేషన్ మెటీరియల్ కారణంగా మంటలను ఆర్పడం సిబ్బందికి సవాలుగా మారింది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ రెండు అగ్నిప్రమాదాలు భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. విద్యుత్ ఉపకరణాల వినియోగంలో అజాగ్రత్త వహించవద్దని అధికారులు సూచించారు. ఈ రెండు ఘటనల్లో ప్రాణనష్టం సంభవించకపోయినా, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



