హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ముగ్గురు సజీవ సమాధి కాగా ..ఐదుగురు చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తుంది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు . మరణించిన వారిలో అభిషేక్ మోదీ,రాజేంద్రకుమార్,మున్నీ బాయి,సుమిత్ర,ఆరుషి జైన్, శీతల్ జైన్,ఇరాజ్ . అర్షాది గుప్తా,రజనీ అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ ,వర్షా మోదీ, ఇద్దక్కి మోదీ , రిషబ్,ప్రథమ్ అగర్వాల్,ప్రాంశీ అగర్వాల్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు సంబంధిత శాఖలు చేపడుతున్నాయి. అగ్నిప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీస్, ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్స్ కు తరలించి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.అగ్నిప్రమాదం పై జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక కుటుంబాలతో ఫోన్ లో పరామర్శించి..మంటల్లో చిక్కుకున్న వారందరినీ కాపాడుతామని భరోసా ఇస్తూ బాధిత కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు . గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు .





