స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం

– సకాలంలో మంటలు ఆర్పడంతో తప్పిన ముప్ప్పు

మేడ్చల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుండిగల్ పరిధి బహదూర్‌పల్లి గ్రీన్‌హిల్స్ కాలనీలోని డెకరేషన్ స్క్రాప్ గోదాంలో గురువారం మంటలు చెలరేగాయి. అగ్నికీలలు వేగంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో పార్క్ చేసిన వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్నిప్రమాదం కారణంగా కాలనీలో దట్టమైన పొగ వ్యాపించింది. ఎగిసిపడుతున్న మంటలు, కమ్మేసిన పొగతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మరోవైపు జీడిమెట్ల పారిశ్రామికవాడలోనూ భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *