– సకాలంలో ఫైర్ సిబ్బంది రాకతో తప్పిన ముప్పు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. నిచ్చెన సాయంతో 60మందిని కిందికి దించారు. నీలగిరి బ్లాక్‌లోని షాపులను మూసివేయించారు. కోచింగ్ సెంటర్‌లోని విద్యార్థులను పంపించారు. గ్రౌండ్ ప్లోర్‌లోని ప్యానెల్ బోర్డులో షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మూడు అంతస్తుల వరకు మంటలు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. పై అంతస్తులోని కొన్ని ఐటీ సంస్థల్లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మెట్ల మార్గం ద్వారా బయటకు వచ్చారు. మరికొందరిని అగ్నిమాపక సిబ్బంది బాల్కనీ ద్వారా, మెట్ల ద్వారా సురక్షితంగా కిందకు చేర్చారు. ఎవరికి గాయాలు కాలేదు. కొందరు కిందకు దూకేందుకు ప్రయత్నించగా వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.
ఎల్బీనగర్ చట్నీస్‌లో పేలుడు : ముగ్గురికి గాయాలు
ఎల్బీ నగర్‌లోని ఆర్కేపురం చట్నీస్ హోటల్‌లో పేలుడు సంభవించింది. భారీ శబ్దానికి వినియోగదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు హోటల్ సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇడ్లీ స్టీమర్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అధిక వేడిమి కారణంగానే స్టీమర్ పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు, హైడ్రా సిబ్బంది, బాంబు స్క్వాడ్ బృందాలు కిచెన్‌ను పరిశీలించాయి. ఇడ్లీ స్టీమర్ వేడెక్కడంతో పేలుడు సంభవించిందా.. ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



