అయోధ్య యాగ‌శాలలో భారీ అగ్నిప్రమాదం

– అగ్నికి ఆహుతి అయిన పందిళ్లు
– ప్రాణ నష్టం లేదన్న యూపీ మంత్రి

అయోధ్య, మార్చి 28: అయోధ్యలోని యాగ‌శాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజఘాట్ లో బట్ బాబా ఆశ్రమం సమీపంలో ఉన్న మహాలక్ష్మి నారాయణ యాగ‌శాలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద పెద్ద పందిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 10 అగ్నిమాపక వాహనాలు రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్ని ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పో లేదని ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్ అన్నారు. మార్చి 20 నుంచి మార్చి 28 వరకు యజ్ఞం జరిగిందని.. తొమ్మి ది రోజుల పాటు జరిగిన మహాయజ్ఞం ముగి శాక ఈ అగ్నిప్రమాదం జరిగిందని వెల్లడించా రు. యజ్ఞశాల ఖాళీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని… అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. కానీ లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు చెప్పారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉన్న యజ్ఞశాల నిమిషాల వ్యవధిలోనే బూడిదైపోయింది. ఈ భారీ అగ్ని ప్రమాదం రామ మందిరానికి కేవలం 800 టర్ల దూరంలో జరిగింది. శనివారం ఉదయం -సుమారు 11:30 గంటలకు పూర్ణాహుతితో యజ్ఞం ముగియగానే భక్తులు ఇళ్లకు వెళ్లి పోయారు. మధ్యాహ్నం తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణం తెలియరాలేదని మంత్రి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *