– శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబరు 6: అమెరికాలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో తెలుగు యువతి ఉడుముల సహజా రెడ్డి ప్రాణాలు కోల్పోయింది. ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె అనుకోని విధంగా చనిపోయింది. గురువారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల ప్రాంతంలోని గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్ రెడ్డి, శైలజ భార్యాభర్తలు. జయాకర్ రెడ్డి టీసీఎస్ లో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. శైలజ బచ్చన్నపేట మండలంలో ఎస్జీటీగా పని చేశారు. జయాకర్ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయింది. జోడిమెట్లలో నివాసం ఉంటోంది. జయాకర్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు సహజారెడ్డి 2021లో ఎంఎస్ చదవటం కోసం అమెరికాకు వెళ్లింది. అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 13 మంది విద్యార్థులు బర్మింగ్హామ్లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటున్నారు. 13 మందిలో ఉడుముల సహజా రెడ్డి కూడా ఉంది. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకున్న సహజారెడ్డి అక్కడికక్కడే చనిపోయింది. అధికారులు ఆమె మరణ వార్తను జోడిమెట్ల వెంకటాపూర్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్న ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. సహజారెడ్డి మరణ వార్త తెలిసి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అమెరికాలోని భారత ఎంబసీ సహజారెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



