హైదరాబాద్‌ ‌షాపింగ్‌ ‌మాల్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26:  జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి షాపింగ్‌ ‌మాల్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో ఫైర్‌ ‌సిబ్బంది మంటలను ఆర్పింది. ఈ విషయంపై హైదరాబాద్‌ ‌డిస్ట్రిక్ట్ ‌ఫైర్‌ ఆఫీసర్‌ ‌రాందాస్‌ ‌మాట్లాడారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా నిర్దారణకు రాలేదని చెప్పారు. లోపల అభివృద్ధి ‌పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రమాద సమయంలో షాపులో సిబ్బంది ఎవరూ లేరని స్పష్టం చేశారు. రెనొవేషన్‌ ‌పనులు జరుగుతుండటంతో మెటీరియల్స్ ‌వేరే ప్రాంతానికి తరలించారని తెలిపారు. ఈ ఘటన షార్ట్ ‌సర్క్యూట్‌ ‌వల్ల జరిగిందా లేక వెల్డింగ్‌ ‌పనుల జరిగిందా అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. ఈ ఘటన సమయంలో ఐదుగురు మాత్రమే షాపులో ఉన్నారని, అంతా సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. షాపులో మెటీరియల్‌ ‌లేకపోవడంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని చెప్పారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. వేసవి సమీపించింది కాబట్టి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. షాపుల్లో ఫైర్‌ ‌నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాందాస్‌ ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *