ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం

– దట్టంగా అలముకున్న పొగతో ఉక్కిరిబిక్కిరి
– మంటలను ఆర్పిన ఐదు ఫైర్‌ ఇం‌జన్లు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 7: నగరంలోని నాంపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఉన్న ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, ఐదు ఫైర్‌ ఇం‌జిన్లతో మంటలను అదుపు చేసారు. అయితే అత్యంత రద్దీగా ఉండే ఈ ఆప్రాంతంలో పక్కనే నిలోఫర్‌ ‌హాస్పిటల్‌ ‌కూడా ఉంది. ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకోవడంతో సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ ఎవరినీ ల్యాబ్‌ ‌లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.ఉదయం 10 గంటల ప్రాంతంలో మొదటి ఫ్లోర్‌లోని ఫోరెన్సిక్‌ ‌ల్యాబ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో కంప్యూటర్లు, ఫోరెన్సిక్‌ ‌సంబంధిత కెమికల్స్‌తో సహా కీలకమైన పత్రాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో పలు ముఖ్యమైన కేసులకు సంబంధించిన ఫోరెన్సిక్‌ ‌రిపోర్టులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ మంటల్లో ఫోన్‌ ‌ట్యాపింగ్‌కు కేసుకు సంబంధించిన హార్డ్ ‌డిస్కులూ కాలిపోయినట్లు సమాచారం. నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ‌పరికరాలు కాలిపోయాయి. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా నల్లటి పొగ అలుముకుంది. ప్రమాదాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.  షార్ట్ ‌సర్క్యూట్‌ ‌కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, ప్రమాదం గురించి తెలియగానే నార్త్ ‌జోన్‌ ‌డీఐజీ శ్వేత, ఖైరతాబాద్‌ ‌జోన్‌ ‌డీసీపీ శిల్పవల్లి ల్యాబ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ల్యాబ్‌లో కీలకమైన కేసులు, ఫోరెన్సిక్‌ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా దెబ్బతిన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోటు కేసు సహా పలు కీలక కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఎవిడెన్స్‌లు ఇక్కడే ఉండటంతో ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చని అంటున్నారు.

అదుపులో మంట‌లు

హైదరాబాద్‌ సెంట్రల్‌ ‌జోన్‌ ‌డీసీపీ కె.శిల్పవల్లి మీడియాతో మాట్లాడుతూ మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదంపై సమాచారం అందిందని, షార్ట్ ‌సర్క్యూట్‌ ‌కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పారు.  మంటల్లో కీలక ఫైల్స్ ‌కాలిపోయిన విషయంపై ఇంకా స్పష్టత లేదన్నారు. మొదటి అంతస్తులో కంప్యూటర్స్ ఉం‌టాయని వెల్లడించారు.  కార్యాలయంలో పనిచేస్తున్న ఆఫీస్‌ ‌బాయ్‌ ‌మంటలను గమనించి సమాచారం అందించారని వివరించారు. ఆఫీస్‌ ‌బాయ్‌ ‌గమనించి వెంటనే మంటలార్పే ప్రయత్నం చేశారన్నారు. ఈ క్రమంలో అతను అస్వస్థతకు లోనయ్యారని, వెంటనే 108లో హాస్పిటల్‌కి తరలించామని డీసీపీ తెలిపారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు నలుగురు ఉద్యోగులు లోపలే ఉన్నారన్నారు. మంటలు గమనించి వారు సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. ఫోరెన్సిక్‌ ‌సైన్స్ ‌ల్యాబ్‌లో మంటలు అదుపులోకి వచ్చాయని డీఎఫ్‌ఓ శ్రీదాస్‌ ‌తెలిపారు. కెమికల్‌ ‌ల్యాబ్‌ ‌మెటీరియల్‌ ‌మొత్తం రెండో అంతస్తులో ఉందని చెప్పారు. అయితే రెండో అంతస్తుకు మంటలు వ్యాపించలేదన్నారు. మొదటి అంతస్తులో సెన్సిటివ్‌గా ఉన్న ప్లాస్టిక్‌ ‌వస్తువులు కాలిపోయాయని వివరించారు. హార్డ్ ‌డిస్కులు పూర్తిగా కాలిపోయాయా.. పాక్షికంగా కాలాయా అన్నది పరిశీలించాలని డీఎఫ్‌ఓ ‌తెలిపారు.

అగ్ని ప్ర‌మాదంపై కేటీఆర్ అనుమానం

ఫోరెన్సిక్‌ ‌సైన్స్ ‌ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. వోటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్‌ ‌రికార్డింగ్‌లను, ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తున్నదని సందేహం వ్యక్తంచేశారు. ఈ మేరకు  ‘ఎక్స్’ ‌వేదికగా స్పందించారు. కాగా, బీఆర్‌ఎస్‌ ‌నేత మన్నె క్రిశాంక్‌ ‌కూడా ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. మొత్తం ల్యాబ్‌ ‌కాలిపోతుంది.. ఏ ఆధారాలు నాశనం చేశావు అని సీఎం రేవంత్‌ ‌రెడ్డిని ప్రశ్నించారు.

అగ్నిప్రమాదంతో రుజువులన్నీ దగ్ధం
ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కార్యాలయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమా దం భారీ నష్టాన్ని మిగిల్చింది. నేర పరిశో ధనలో అత్యంత కీలకమైన సాక్ష్యాధారాలను భద్రపరిచే చోట మంటలు చెలరేగడంతో, పలు కేసుల్లో సేకరించిన భౌతిక ఆధారాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమా
దంపై డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడు తూ విస్తుపోయే వివరాలను వెల్లడించారు. మంటలు వ్యాపించిన తీరు, జరిగిన ఆస్తి న ష్టం, కేసులపై పడే ప్రభావం గురించి ఆయన వివరించారు. ఈ అగ్నిప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, సాక్ష్యాధారాలను భద్రపరిచిన గది మొత్తం పూర్తిగా కాలిపో యిందని శ్రీదాస్ తెలిపారు. విచారణలో ఉన్న పలు కేసులకు సంబంధించి సీజ్ చేసిన ప్రాపర్టీ మొత్తం ఈ ప్రమాదంలో ధ్వంసమైందని పేర్కొన్నారు. ముఖ్యంగా డిజిటల్ సాక్ష్యాల నిధిగా భావించే 40 నుండి 50 కంప్యూటర్లు మంటల్లో కాలి బూడిదయ్యా యి. గదిలో అత్యంత భద్రంగా స్టోర్ చేసి ఉంచిన హార్డ్ డిస్క్లు కూడా మంటల ధా టికి పూర్తిగా కాలిపోయాయని, దీనివల్ల కీల కమైన డిజిటల్ డేటా శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఎలక్ట్రానిక్ వస్తువులే కాకుండా, ఆ గదిలో ఉన్న వివిధ రకాల ప్లా స్టిక్ వస్తువులు కూడా మంటలకు తోడవడంతో నష్టం తీవ్రత ఊహించని స్థాయిలో జరిగింది. ఈ దుర్ఘటనకు విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *