వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో ‘సిట్‌’

-కేసీఆర్‌కు నోటీసులపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: జరిగిన వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్ ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సిట్ సంపూర్ణ విచారణ జరిగితేనే తెలుస్తుందని, నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. ఈ విషయంలో వాస్తవాలు వెలుగులోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులపై ఆయన స్పందించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆనాడు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదని ఆయన చెప్పారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకుండా అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడరని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరు భాగస్వాములో తేలాల్సి ఉందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో పారదర్శక విచారణ జరగాలని కోరారు మహేశ్ కుమార్. 500కు పైగా ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేశారనే సమాచారం ఉందని చెప్ప్పుకొచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *