ఫిలిం సొసైటీల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. 

– ఎఫ్ఎఫ్ఎస్ఐ సౌత్ రీజియన్ ప్రధాన కార్యదర్శి పొన్నం రవిచంద్ర
బెంగళూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: ఫిలిం సొసైటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఎఫ్.ఎఫ్.ఎస్.ఐ సౌత్ రీజియన్ ప్రధాన కార్యదర్శి డా.పొన్నం రవిచంద్ర కోరారు.  బెంగళూరులో  సుచిత్ర ఫిలిం సొసైటీ లో శనివారం జరిగిన సౌత్ రీజియన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో లాగానే అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శించుకోవడానికి ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థికపరమైన ఇబ్బందులతో అనేక ఫిల్మ్ సొసైటీలు మూతపడుతున్నాయని వాటి మనుగడకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సౌత్ రీజియన్ ఉపాధ్యక్షులు ఎన్. శశిధర అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యదర్శి బి. ప్రకాష్ రెడ్డి, వైజాగ్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు నర్వ ప్రకాష్ కఫీసో కార్యదర్శి లక్ష్మీగౌతం తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *