ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కర్టెన్‌రైజర్‌ ఆవిష్కరణ

– పర్యాటక భవన్‌పై బెలూన్‌ ఎగురవేత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: తెలంగాణ ఫిలిం డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఫెస్టివల్‌కు సంబంధించిన ప్రమోషన్‌ ఈవెంట్స్‌ మొదలుపెట్టారు. ఈ ఫెస్టివల్‌ కర్టెన్‌ రైజర్‌ను బుధవారం సాయంత్రం టూరిజం ప్లాజాలో టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి, కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రియాంక కలిసి ఆవిష్కరించారు. టూరిజం భవనంపై ప్రచార బెలున్‌లను కూడా ఎగురవేశారు. 700కు పైగా వివిధ దేశాల నుంచి సైతం వచ్చిన సినిమాల ప్రోమోను ప్రదర్శించారు. ఈ సందర్బంగా వల్లూరు క్రాంతి మాట్లాడుతూ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రపంచ వేదికగా ఎదిగిందని, యూరప్‌, అమెరికా వంటి దేశాల నుంచి సినిమాలు వచ్చాయని చెప్పారు. మన దేశంతో పాటు వివిధ దేశాల నుంచి 700కి పైగా చిత్రాలు రావడం హర్షించదగిన విషయమన్నారు. నూతనంగా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే యువతీయువకులకు ఇదొక గొప్ప వేదిక అవుతుందని ఆమె అన్నారు. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ హైదరాబాద్‌ ఖ్యాతిని పెంచేలా ఉంటుందని పేర్కొన్నారు. ప్రియాంక మాట్లాడుతూ ఈ చిత్రోత్సవాన్ని నిర్వహించే దాదా సాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ స్టడీస్‌ బృందాన్ని అభినందించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభం నుండి వారు చేసిన అవిశ్రాంత కృషిని ప్రశంసించారు. హైదరాబాద్‌లో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో రూపొందిన ప్రసాద్స్‌ ఐమాక్స్‌లో ఈ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రదర్శనకు అధికారికంగా ఎంపికైన 60మంది చిత్ర నిర్మాతలందరికీ ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ స్టడీస్‌ అధినేత, అంకురం దర్శకుడు ఉమామహేశ్వర్‌ రావు మాట్లాడుతూ మూడు రోజులపాటు షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ నిర్వహించి వదిలేయడం కాకుండా తరువాత కూడా సినిమాలు పంపిన యువతతో, సినిమాలు చూసిన యువతతో ఒక అవగాహన సదస్సు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దీని ద్వారా సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నారు అనేక అంశాలపై అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ డైరెక్టర్‌ కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *