సింగరేణి ఉద్యోగుల కోసం పోరాటం

– డిపెండెంట్‌ ఉద్యోగాలను కాపాడుకోవాలి
– డిసెంబర్‌ 13‌న సిఎండి కార్యాలయ ముట్టడి
– ఖమ్మం జాగృతి బాటలో కవిత వెల్లడి

ఖమ్మం,ప్రజాతంత్ర,నవంబర్‌ 17:‌డిపెండెంట్‌ ఉద్యోగాలు కాపాడుకోలేని స్థితిలో ఇప్పుడు ఉన్నామని జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలు చేశారు.  డిసెంబర్‌ 13‌న సింగరేణి సీఎండీ కార్యాలయాన్ని ముట్టడి చేయబోతున్నామని ఖమ్మం జిల్లాలో జాగృతి బాటలో కవిత ప్రకటించారు. సింగరేణి ఉద్యోగం ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ ‌లాంటిదని… డిపెండెంట్‌ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తామన్నారు. సోమవారం సత్తుపల్లి జేవీఆర్‌ ఓసీ సింగరేణిలో కార్మికులతో కవిత మాట్లాడారు. అనంతరం డియాతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా మెడికల్‌ ‌బోర్డ్ ‌కోసం కోట్లాడుతున్నామన్నారు. సింగరేణి గని కార్మికులకు ఇన్‌కమ్‌ ‌ట్యాక్స్ ‌కట్‌ ‌చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని.. ‘కోసం పోరాటం చేసే మాకు అండగా ఉండాలి అని కోరుతున్నాం’ అని కవిత అన్నారు. కొత్త బొగ్గు బ్లాక్‌లు సింగరేణికి అందించాలని డిమాండ్‌ ‌చేశారు. కేంద్రం బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్‌ ‌వ్యక్తులకు వేలం వేయడాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం సింగరేణికి అక్షరాలా రూ.40 వేల కోట్ల అప్పు ఉందని తెలిపారు. సింగరేణి కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయాలని కోరుతున్నామన్నారు. ఆసుపత్రి నిర్మాణం చేసే లోపు కార్పోరేట్‌ ‌హాస్పిటల్స్‌లో వైద్యం అందించాలని డిమాండ్‌ ‌చేశారు. కాంట్రాక్ట్ ‌కార్మికులు పెర్మినెంట్‌ అయ్యేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు. బొగ్గు బావిలోకి దిగే ముందు మైసమ్మకు మొక్కుకుని జాగ్రత్తగా ఉండాలని కవిత సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page