ఫీల్డ్‌ అసిస్టెంట్లందరికీ ఒకే జీతం

– పదేళ్ల సమస్యలకు మంత్రి సీతక్క పరిష్కారం
– హర్షం వ్యక్తం చే ఫీల్డ్‌ అసిస్టెంట్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు సచివాలయంలో సమావేశమై పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సీతక్క స్పందించి వారి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఫీల్డ్‌ అసిటెంట్ల మధ్య వ్యత్యాసం లేకుండా అందరికీ ఒకే జీతం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఫీల్డ్‌ అసిటెంట్లకు గ్రూప్‌ ఇస్యూరెన్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సర్క్యులర్‌ 4779 రద్దు, గతంలో తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి తీసుకునేలా సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని అధికారులకు చెప్పారు. జీతాల పెంపు, ఫిక్స్‌డ్‌ టైం స్కేల్‌పౖౖె ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఫీల్డ్‌ అసిస్టెంట్ల బదిలీలకు అనుమతిస్తూ శాఖ పరిధిలోని అన్ని అంశాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఫీల్డ్‌ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి సీతక్కను సన్మానించారు. పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యలు సీతక్కతోనే పరిష్కారమయ్యాయంటూ కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *