ఫెడ్ రిజర్వ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్‌

– ట్రంప్ ప్రకటనతో అనూహ్య మార్పులు
– బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం

వాషింగ్టన్, జనవరి 31 తాజాగా బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పడిపోవడానికి కారణం కెవిన్ వార్ష్‌ అని ఆర్థిక విశ్లేషకులు గుర్తించారు. ప్రస్తుత చీఫ్ జెరోమ్ పావెల్ పదవీకాలం మేలో ముగియనుండగా తదుపరి చైర్మన్‌గా కెవిన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేయడంతో గ్లోబల్ మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి.ఫెడరల్ రిజర్వ్ మాజీ గవర్నర్లు వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారని మార్కెట్ ఇన్వెస్టర్లకు బాగా తెలుసు. వడ్డీ రేట్లు పెరిగే అవకాశమున్నందున డాలర్ బలోపేతం ఎక్కువగా జరుగుతుందని అంచనా వేశాయి. దీని వల్ల ఇన్వెస్టర్లు భయాందోళనకు లోనై బంగారం, వెండి అమ్మకాలను భారీగా పెంచారు, ఫలితంగా ధరలు కుప్పకూలిపోయాయి. గతంలో కూడా ఫెడరల్ రిజర్వ్ గవర్నర్లు నామినేట్ అయ్యినప్ప్పుడు బంగారం, వెండి ధరల్లో మార్పులు నమోదయ్యాయి. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగే సూచనలు వస్తే సౌకర్యవంతమైన పెట్టుబడుల పట్ల భయం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భౌతిక వనరులకు దారిచూపే డిమాండ్ తగ్గిపోతుంది. తద్వారా మార్కెట్ ధరల్లో తగ్గుదల ఉంటుంది. ఈ పరిస్థితి కొంతకాలం కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకుల అంచనా. ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తులపై దృష్టి సారిస్తే ధరల పునరుద్ధరణ కొంత ఆలస్యమవుతుంది. 2017లో ఫెడ్ చీఫ్‌గా పావెల్‌ను ఎంపిక చేసుకున్న ట్రంప్ వడ్డీ రేట్లను త్వరగా తగ్గించడం లేదని ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయంపై ట్రంప్ స్పందిస్తూ కెవిన్ తనకు చాలా ఏళ్లుగా తెలుసునని, రానున్న రోజుల్లో ఆయన ఉత్తమ ఫెడ్ చీఫ్‌లలో ఒకరు కావడంలో సందేహం లేదని అన్నారు. ఆయన ఎప్పటికీ నిరాశపరచడని పేర్కొంటూ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు. అయితే అధ్యక్షుడి నియామకానికి సెనేట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఫెడరల్ బోర్డు ఆఫ్ గవర్నర్స్‌లో కెవిన్ వార్ష్ 2006 నుంచి 2011 వరకు సభ్యుడిగా ఉన్నారు. 35 ఏళ్ల వయసులోనే ఆ బాధ్యతలు చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం స్టాన్‌ఫర్డ్ బిజినెస్ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *