సర్పంచ్‌ ఎన్నిక కోసం కన్నకూతురు బలి

– ముగ్గురు సంతానం నిబంధనతో ఒకరిని చంపేసిన తండ్రి
– హత్యను ఛేదించిన నిజామాబాద్‌ ‌పోలీసులు

నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2:: పంచాయితీ ఎన్నికల కోసం ఓ తండ్రి కన్నకూతురునే బలితీసుకున్నాడు.కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రి తన స్వార్థం కోసం అభం శుభం తెలియని ఆరేళ్ల కూతురిని హత్య చేసిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన నిజామాబాద్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్‌ ‌జిల్లా ముఖేడ్‌ ‌తాలూకా కేరూర్‌కు చెందిన పాండురంగ, త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే, ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హత ఉందని పాండురంగ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఆరేళ్ల పెద్ద కూతురు ప్రాచీని బైక్‌పై తీసుకొచ్చి నిజామాబాద్‌ ‌జిల్లా ఎడపల్లి మండలం ఎఆర్‌పి శివారులో కాలువలో పడేసి చంపేశాడు. కెనాల్‌లో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని బయటకు తీసి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కన్న తండ్రే హంతకుడని తేలింది. పాండురంగ్‌తో పాటు అతనికి సహకరించిన గ‌ణేష్‌ ‌షిండేను అరెస్ట్ ‌చేశారు. బాలికను తీసుకువచ్చేందుకు ఉపయోగించిన బైక్‌, ‌మూడు మొబైల్‌ ‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్‌ ‌సీపీ సాయి చైతన్య తెలిపారు. ఈ కేసులో మృతురాలు తండ్రి పాండురంగతో పాటు కేరూరు సర్పంచ్ ‌గ‌ణేష్‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *